ఈ మధ్య తెలుగు సినీ పరిశ్రమ కమర్షియల్ కోణంలో ఆలోచిస్తుందని చెప్పాలి. ఎందుకంటే దాదాపు ఈ మధ్య రిలీజ్ అయిన అన్ని సినిమాల్లోనూ హీరోలు వాళ్ళ లుక్ వరకే కాకుండా ఇతర విషయలపై కూడా శ్రద్ద తీసుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే తమ హీరో ఇమేజ్ ను పక్కన పెట్టి ఆలోచిస్తున్నారు. కథకు హీరో గా ఏవిధంగా అవసరమో తెలుసుకుని వాళ్ళను అలా మలచుకుంటున్నారు. ఎక్కువగా హీరోలు అందరూ ఏ ప్రాంతానికి చెందిన నాయకుడి పాత్ర పోషిస్తుంటే ఆ ప్రాంత యాస డైలాగుల తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. 

 

ఈ బాణీ అప్పట్లో దాదాపు అగ్ర హీరో లు అందరూ చేశారు. బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, రాజేంద్ర ప్రసాద్, ఇలా 90 లలో హీరోలు అందరూ చేశారు. నేటి తరం యువ హీరోలు అందరూ కూడా ఇప్పుడు అదే బాణీ నీ ఫాలో అవుతున్నారు. ఎన్టీఆర్ ను తీసుకుంటే అరవింద సమేత మూవీ లో రాయలసీమ యాస డైలాగుల తో ప్రేక్షకులను మెప్పించారు. రంగస్థలం లో చిట్టిబాబు గా గోదావరి జిల్లా యాస తో అదరగొట్టిన రామ్ చరణ్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. 

 

ఇక పోతే ఇస్మార్ట్ శంకర్ లో హీరో రామ్ తెలంగాణ యాస చూసి హైదరాబాదీలు కూడా ఇంత స్పష్టంగా మాట్లాడలేరు అన్నట్టు చెప్పారు. హీరోలే కాదు యాస డైలాగుల చెప్పేది మేము చెబుతాం అంటూ తన సొంత గొంతు తో  సాయి పల్లవి ఫిదా మూవీలో తెలంగాణ పలుకులు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ రకంగా యువ హీరోలు కొత్త ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులకు కావల్సిన ఎంటర్టైన్మెంట్ అందించడానికి తమ వంతు కృషి చేస్తున్నారు అని చెప్పాలి. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చిత్తూరు యాసలో నటిస్తున్నాడు. అలాగే చైతు... శేఖర్ కమ్ముల చిత్రంలో తెలంగాణా యాస లో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: