వంటలకు వార్పులకు మంచి వాతావరణం ఉండాలి. మనసు పెట్టి చేయాలంటే ప్రశాంతంగా పరిసరాలు ఉండాలి. అన్నీ చూసుకుంటే విశాఖ కంటే ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది. సాగరుడు ఓ వైపు పాదాలు కడుగుతూ ఉంటే పచ్చని కొండలు చల్లగా ఉండమంటూ దీవిస్తాయి.

 

అందుకే విశాఖ ఎందరో దర్శకులకు స్వీట్ హార్ట్ అయింది. ఓ బాలచందర్, విశ్వనాధ్, జంధ్యాల‌, రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు వంటి వారు విశాఖ అందాలను సెల్యూలాయిడ్ పై  సూపర్ గా చూపించారు. అందంగా విశాఖను మలచారు. ఇప్పటి తరం డైరెక్టర్లకు కూడా విశాఖ అంటే అదో రకం లవ్వు. ఆ మోజు ఎక్కువగా ఉన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి.

 

ఆయన ఇపుడు సరిలేరు నీకెవ్వరు మూవీ సక్సెన్ ఎంజాయి చేస్తున్నారు. ఆ ఊపులోనే మరో కొత్త సినిమాకు కధ రాసుకోవడానికి విశాఖ వచ్చారు. విశాఖలో ఒక హొటల్ రూంలో ఆయన వంట వండేస్తున్నారు. డోంట్ డిస్టర్బ్ మీ అంటూ ఆయన తన పని కామ్ గా కానిచ్చేస్తున్నారు. ఇంతకీ ఆయన వండుతున్న వంట ఎఫ్2 కి సీక్వెల్ గా వస్తున్న ఎఫ్ 3 మూవీ కోసమట‌. ఈ స్క్రిప్ట్ తయారీలో అనిల్ ఇపుడు యమ బిజీగా ఉన్నారు.

 

ఆయన ఎఫ్ 2 మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ మూవీలో వెంకటేష్, వరుణ్ అదరగొట్టేలా న‌టించారు. ఇపుడు ఎఫ్ 3 లో కూడా వీరిద్దరు హీరోలూ  ఖాయమని అంటున్నారు. వీరితో పాటు మరో హీరో కూడా ఉంటారట. మొత్తానికి ఫుల్ కామెడీతో కడుపుబ్బ నవ్వించే సీన్లు అన్నీ విశాఖ బీచ్ ని చూస్తూ అనిల్ రావిపూడి రాసేస్తున్నారు.

 

ఇపుడు వెంకటేష్ నారప్ప షూటింగులో బిజీగా  ఉన్నాడు. వరుణ్ కూడా వేరే మూవీలో యమ‌ బిజీగా ఉన్నాడు. ఈ ఇద్దరి డేట్లూ చూసుకుని మూవీని ఈ ఏడాదే  సెట్స్ మీదకు తెచ్చేందుకు అనిల్ రెడీ అవుతారని అంటున్నారు. మొత్తానికి అనిల్ తాజా  కామెడీ వంటకం ఎఫ్ 2 ని మించుతుందా. బ్లాక్ బస్టర్ కా బాప్ అవుతుందా అన్నది చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: