మన తెలుగులో వ్యాపారం మీద ఎక్కువగా ప్రేమ ఉన్న యువ హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. ఆయనకు వ్యాపార రంగం మీద ముందు నుంచి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఉన్నత విద్యావంతుడు అయిన విజయ్ కి వ్యాపారాల్లో రాణించాలి అని చిన్న నాటి నుంచి ఎక్కువగా కోరిక ఉందని అంటారు. అందుకే అతను ఇప్పుడు ఎక్కువగా సినిమాలతో పాటుగా వ్యాపారం మీద కూడా ఫోకస్ చేసాడని అంటారు. ప్రస్తుతం మన తెలుగులో యువ హీరోలు ఎవరూ కూడా ఇలాంటి విధంగా వ్యాపారాలు చేయలేదు. 

 

ప్రస్తుతం విజయ్ బట్టల వ్యాపారంలో ఎక్కువగా పెట్టుబడి పెట్టాడు. అతని బ్రాండ్ ని రంగంలోకి దింపాడు. దానికి సంబంధించి మంచి లాభాలు కూడా అతనికి వస్తున్నాయని అంటున్నారు. ఇప్పుడు ఈ బ్రాండ్ ని దేశ వ్యాప్తంగా విస్తరించాలి అనే ఆలోచనలో ఉన్నాడు ఈ యువ హీరో అని అంటున్నారు. అందుకే టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తో కలిసి అతను అడుగులు వేసే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. విరాట్ కోహ్లీ ఇప్పటికే తన భార్య తో కలిసి బట్టల విషయంలో పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే. 

 

ఆయనకు మంచి లాభాలు రావడం తో ఆ విధంగా ఇప్పుడు విజయ్ అడుగులు వేస్తున్నాడు. కోహ్లీ తో కలిసి వ్యాపారం చెయ్యాలని భావిస్తున్నాడని అంటున్నారు. కోహ్లీ ప్రస్తుతం ఆ రంగం మీదే కాకుండా రెండు మూడు రంగాల్లో పెట్టుబడులు ఎక్కువగానే పెట్టాడు. అతని తో కలిసి వ్యాపారం చేస్తే మంచి లాభం రావడం ఖాయమని భావించి అతని బ్రాండ్ ని ఇక్కడ ప్రమోట్ చెయ్యాలని తన బ్రాండ్ ని కోహ్లీ ప్రమోట్ చేస్తాడని భావించినట్టు సమాచారం. దీనికి సంబంధించి కోహ్లీ కూడా సానుకూలంగా నే ఉన్నాడని విజయ్ గురించి అతను ఆరా కూడా తీసినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: