కరోనా ప్రభావం రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది..ఈ మేరకు లాక్ డౌన్ ను పూర్తిగా కఠిన తరంగా మారుస్తున్నారు.. ఇకపోతే లాక్ డౌన్ కారణంగా ప్రలజలతో పాటుగా సెలెబ్రెటీలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు.. సోషల్ మీడియా లో కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుపుతూ వస్తున్నారు.. సెలెబ్రెటీలు మాత్రమే ఈ విషయం రచ్చ చేస్తున్నారు.. అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు.. 

 

 

 

 

 

 

మరో విషయమేంటంటే.. సినిమాలు, షో లు లేకపోవడంతో నటీనటులంతా గతంలో వారు చేసిన పనులను మళ్లీ ఎంచుకుంటున్నారు..కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ దెబ్బకు సినీ పరిశ్రమ మూతపడిన సంగతి తెల్సిందే.  సినిమా షూటింగ్స్ కూడా ఎక్కడికక్కడే  ఆగిపోయాయి. అయితే సినీ పరిశ్రమ నిలిచిపోవడంతో పెద్ద హీరో హీరోయిన్స్‌కు, నటీ నటులకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా... చిన్న చిన్న పాత్రలలో నటించే వాళ్ళు,  రియాలిటీ షోస్ చేసే వాళ్ల పరిస్థితి మాత్రం ఇబ్బందికరంగానే మారింది. 

 

 

 

 

 

 

ఇలా సినిమా పరిశ్రమ మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి పని చేస్తున్న వేలాది కుటుంబాలపై కరోనా ప్రభావం చూపించింది. అయితే కరోనా దెబ్బకు ఎలాంటి పనులు లేకపోవడంతో ఇప్పటికే చాలా మంది సొంత ఊళ్లకు చేరుకున్నారు. ఇళ్ళలోనే ఉంటూ కుటుంబాలతో గడుపుతున్నారు. ఇందులో జబర్ధస్త్ జీవన్ కూడా ఒకడు. షూటింగ్స్ ఆగిపోవడంతో  సొంత ఊరైన మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం గుండెంరాజుపల్లి గ్రామానికి  వెళ్ళిన జీవన్... రైతుగా మారాడు. ఇంటి వద్ద వ్యవసాయ పనులు చేస్తూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నాడు. 

 

 

 

 

ఈ మేరకు వరి ధాన్యాన్ని తూర్పారా పడుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కాగా జీవన్ విషయానికొస్తే.. చిన్న చిన్న పనులు చేసుకుంటూ పలు టీవీ చానెల్స్‌లో యాంకర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు.  ఆయన టాలెంట్‌ను నచ్చిన కిరాక్ ఆర్.పి. చమ్మక్ చంద్ర తమ స్కిట్‌లో చాన్స్ ఇచ్చారు.  జబర్ధస్త్ కంటే ముందు జీవన్.  ఎన్నో స్టేజ్ షోలతో ప్రేక్షకులను అలరించాడు.. ఇలా అందరూ చేస్తే రైతు విలువ తెలుస్తుందని అంటున్నారు...

 

మరింత సమాచారం తెలుసుకోండి: