ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అందరు హీరోలలో ఫ్యామిలీ ఎమోషన్స్ పండించి ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించడం  విక్టరీ వెంకటేష్ కే సాధ్యం అని చెప్పాలి. మొదటి నుంచీ ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ తనలోని నటుడిని ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు కొత్తగా చూపిస్తూ వస్తున్నారు విక్టరీ వెంకటేష్. అయితే ఇప్పటి వరకు విక్టరీ వెంకటేష్ ఎన్నో రీమేక్ సినిమాలో నటించి సంచలన విజయాలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అందుకే వెంకటేష్ ఎక్కువగా రీమేక్ సినిమాలపై మొగ్గు చూపుతుంటారు. ఇలా విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ఓ రీమేక్ మూవీ చంటి. 

 

 

 చంటి సినిమా గురించి ప్రేక్షకులకు తెలియని కాదు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక అమాయకుడైన పాత్రలో వెంకటేష్ చేసిన యాక్టింగ్ కి  ఇప్పుడు చూసినా ఫిదా అవ్వాల్సిందే. అంతటి అద్భుతమైన యాక్టింగ్ చేసి చంటి సినిమాలో ఏకంగా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు వెంకటేష్. విక్టరీ వెంకటేష్ మీనా కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా మంచి  విజయాన్ని అందుకుంది. జమీందార్ల కుటుంబంలో జన్మించిన మీనా... నిరుపేద  కుటుంబంలో జన్మించిన వెంకటేష్ మధ్య ప్రేమ ఎలా చిగురిస్తుంది. వీరిద్దరి పెళ్లి జరిగిన తర్వాత ఎలాంటి సంఘటనలు ఎదురవుతాయి అన్నది ఈ సినిమా స్టోరీ.

 

 

 కాగా అమాయకుడిగా చంటి పాత్రలో వెంకటేష్ నటించిన తీరు ఇప్పటికే ఎంతోమంది ఆకట్టుకుంటుంది అన్న విషయం తెలిసిందే. తనలోని నటుడిని ఈ సినిమాలో కొత్తగా చూపించారు విక్టరీ వెంకటేష్. ఇక ఈ సినిమా తమిళ రీమేక్ సినిమాగా తెరకెక్కింది. తమిళంలో ఈ సినిమాను చిన్న తంబీ అనే పేరుతో  తెరకెక్కించారు. కాగా చిన్న తంబీ అనే సినిమాని తెలుగులో చంటి అనే సినిమాతో తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకున్నారు దర్శకనిర్మాతలు.

మరింత సమాచారం తెలుసుకోండి: