బాలక్రిష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ నర్తనశాలను షార్ట్ ఫిల్మ్ గా  డిజైన్ చేసి జనం ముందుకు తీసుకువస్తున్నారు. ఈ మూవీ ద్వారా బాలయ్య తన రెండు కోరికలను నెరవేర్చుకున్నారు. ఒకటి తండ్రి ఎన్టీయార్ గతంలో తీసిన నర్తనశాలను తిరిగి తాను తీయాలనుకోవడం. అలాగే అర్జునుడుగా పౌరాణిక పాత్రను ధరించడం. మరొక‌టి ఏంటి అంటే తాను దర్శకత్వం చేయడం. నిజంగా దర్శకత్వం చేయాలని ప్రతీ హీరోకూ ఒక కోరిక ఉంటుంది. బాలయ్య అయితే చాలా కాలంగా చెబుతూ వచ్చారు. అది 2004లో ఆయన నెరవేర్చుకున్నారు.

కానీ కొన్ని సీన్లు షూట్ జరిగాకా ఆ మూవీ అలా ఆగిపోయింది. దానికి కారణం ఆ మూవీలో ద్రౌపదిగా నటించిన సౌందర్య కన్నుమూశారు. ఆమె హెలికాప్టర్  ప్రమాదంలో 2004 ఏప్రిల్ లో దుర్మరణం పాలు అయ్యారు. అంటే మార్చిలో ఈ సినిమా షూటింగ్ మొదలు పెడితే నెల రోజుల్లోనే ఆమె లేరని వార్త వచ్చింది. దాంతో బాలయ్య ఆ సినిమాను పక్కన పెట్టేశారు. నిజానికి నర్తనశాలకు చాలా ముఖ్యమైన పాత్ర ద్రౌపది. ఆ రోల్ వేయాలంటే ఆమె తప్ప రీప్లేస్ మెంట్ లేదని బాలయ్య గట్టిగా భావించి సినిమానే ఆపేశారు.

ఇక కొన్నేళ్ళకు భీముడు  పాత్రధారి శ్రీహరి కూడా కన్నుమూశారు. నిజానికి భీముడుగా శ్రీహరి యాప్ట్. ఇపుడు ఆ సినిమాలో నాడు తీసిన కొన్ని సన్నివేశాలను జనం ముందుకు తీసుకురావలాని బాలయ్య నిర్ణయించడంతో  ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ షార్ట్ ఫిల్మ్ ని ఈ నెల 24న ఓటీటీ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బాలయ్య ఈ సినిమాలో అందరూ ఉంటారు అంటూ ఒక హింట్ వదిలాడు. పెద్దాయన ఎన్టీయార్ లేకుండా పౌరాణిక చిత్రమా అంటూ ఒక ఆసక్తిని రేకెత్తించారు. అంటే సీనియర్ ఎన్టీయార్ ఈ మూవీలో ఎక్కడో ఒక చోట కనిపిస్తారు అన్న మాట. నిజంగా ఇది బాలయ్య ఫ్యాన్స్ కి డబుల్ బొనాంజావే మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: