కోలీవుడ్ సూపర్ హిట్ డైరక్టర్ అట్లీ కోలీవుడ్ లో వరుసగా విజయ్ సినిమాలతో సత్తా చాటుతున్నాడు. తెలుగులో అతనికి ఛాన్స్ వచ్చిందని వార్తలు వచ్చినా అవేవి వర్క్ అవుట్ కాలేదు. ఎన్.టి.ఆర్, మహేష్ లతో సినిమాలంటూ వార్తలు వచ్చాయి. ఇక లేటెస్ట్ గా బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు అట్లీ.

విజయ్ తో బిగిల్ తర్వాత షారుఖ్ సినిమా చేస్తున్న అట్లీ ఈ సినిమాను చాలా స్పెషల్ గా ఉండేలా చేస్తున్నాడు. ఒకప్పుడు బాలీవుడ్ ను శాసించిన షారుఖ్ దశాబ్ధ కాలంగా ఒక్క హిట్టు పడలేదు. సినిమాలు చేస్తున్నా సరే పెద్దగా ప్రభావం చూపించట్లేదు. అందుకే హిట్టు కోసం షారుఖ్ సౌత్ డైరక్టర్ ను నమ్ముకున్నాడు. షారుఖ్, అట్లీ కాంబోలో వస్తున్న సినిమా చాలా స్పెషల్ గా ఉంటుందని తెలుస్తుంది.

అంతేకాదు ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ డ్యుయల్ రోల్ చేస్తున్నట్టు టాక్. తండ్రి కొడుకులుగా షారుఖ్ ఈ సినిమాలో కనిపిస్తారని అంటున్నారు. తప్పకుండా షారుఖ్ ఫ్యాన్స్ కోరుకునే సూపర్ సెన్సేషనల్ హిట్ గా ఈ సినిమాను మలిచేందుకు అట్లీ ప్రయత్నిస్తున్నాడని తెలుస్తుంది. స్క్రిప్ట్ దశలోనే సినిమా పక్కా హిట్ అనే కాన్ ఫిడెన్స్ తో వెళ్తున్నారట. మరి షారుఖ్ కోరుకునే హిట్ అట్లీ ఇస్తాడో లేదో చూడాలి. అట్లీ షారుఖ్ తో చేసే ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. తప్పకుండా ఇది చాలా ప్రత్యేకమైన సినిమా అవుతుందని అంటున్నారు.                                                                   

మరింత సమాచారం తెలుసుకోండి: