కరోనా కారణంగా లాక్ డౌన్ పుణ్యమా అని... ఎంతోమంది బ్యాచిలర్ జీవితాలను గడుపుతున్న స్టార్ హీరోల పెళ్లిళ్లు కాస్త అయి పోయాయి. ఇది యాదృచ్ఛికమో లేక సమయం కలిసి వస్తుందిలే... అనుకున్నారో ఏమో గానీ కరోనా కష్ట సమయంలో కాస్త టైం దొరకగానే పెళ్లి చేసుకుని సెటిల్ అయి పోయారు మన స్టార్ హీరోలు. అదే తరహాలో సమయం కాస్త కలిసి రావడంతో తాను మెచ్చిన చెలి తో ఓ ఇంటి వాడయ్యాడు హీరో నితిన్. కానీ హీరో నితిన్ తిరిగి షూటింగ్స్ లో బిజీ అయినప్పటికీ ఈ కొత్త జంట సంతోషానికి మాత్రం తమ వర్క్  అడ్డు కాదని నిరూపిస్తున్నారు.

ప్రస్తుతం రంగ్ దే షూటింగ్ లో బిజీగా ఉన్న నితిన్.... ఒకేసారి స్వామి కార్యం స్వకార్యం అన్నట్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రొఫెషనల్ లైఫ్ ని అలాగే పర్సనల్ లైఫ్ ని రెండింటిని బ్యాలెన్స్ చేయగలనని ప్రూవ్ చేస్తున్నాడు ఈ క్యూట్ హీరో. అయితే ఈ విషయం ఎవరు ఇంత వరకు లీక్ చేయలేదు. ప్రస్తుతం రంగ్ దే చిత్ర బృందం షూటింగ్ కోసం దుబాయ్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే దుబాయ్ కి తనతో పాటు భార్యామణి షాలిని ని కూడా తీసుకెళ్లారట నితిన్. అలా షూటింగ్లో  పేకప్ చెప్పగానే.... ఇలా తన భార్య మీద ఇష్క్ తో దుబాయ్ లో షికార్లు కొట్టేస్తున్నారట నితిన్.

కొత్త జంటలతో ఇదేగా తంటా! అంటూ చిత్రబృందం నితిన్ ని సరదాగా ఏడిపించేస్తున్నారట. దుబాయ్ అందాల్ని  ఆస్వాదిస్తూ.. నితిన్ - షాలిని జంట అదిరిపోయే ఫోటోల్ని లీక్ చేస్తుండడంతో అసలు సంగతి కాస్తా తెలిసింది మరి. ఎలాగైతేనేం అటు ప్రొఫెషన్ ని ఇటు తన పర్సనల్ లైఫ్ ని ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు హీరో నితిన్.

మరింత సమాచారం తెలుసుకోండి: