బిగ్ బాస్ సీజన్ 4లో జబర్దస్త్ కమెడియన్ అవినాష్ ఎంట్రీ అందరికి షాక్ ఇచ్చింది. జోకర్ గా ఎంట్రీ ఇచ్చి హౌజ్ లో సూపర్ ఎంటర్టైనర్ గా నిలిచిన బిగ్ బాస్ మధ్యలో టాస్కులు, నామినేషన్స్ లో కొద్దిగా తడపడుతూ వచ్చాడు. అయితే కామెడీ చేసే వారికి ఎమోషన్స్ ఉండవా అనుకుంటూ అవినాష్ ను సపోర్ట్ చేసే వారు కూడా ఉన్నారు. అయితే వారాలు గడుస్తున్నా కొద్దీ హౌజ్ లో ఉన్న వారంతా బయటకు వెళ్లడం ఫైనల్ గా ఏడుగురు మాత్రమే హౌజ్ లో మిగలడం జరిగింది.

ఇక సూపర్ సెవన్ లో ముందు ఎవరు హౌజ్ నుండి బయటకు వస్తారో తెలియాల్సి ఉంది. ఈ వారం నామినేషన్స్ లో సోహెల్, అరియానా తప్ప మిగిలిన ఐదుగురు ఉన్నారు. అయితే ఈ వారం మోనాల్, అవినాష్ ల మధ్య టఫ్ ఫైట్ జరుగుతుందని తెలుస్తుంది. అయితే అవినాష్ కు కామెడీ గ్యాంగ్ అంతా సపోర్ట్ గా నిలుస్తుంది. జబర్దస్త్ టీం లో ఉన్న వారంతా కూడా అవినాష్ కోసం ప్రమోషన్స్ మొదలుపెట్టారు.

అవినాష్ ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగినట్టు తెలుస్తుంది. అవినాష్ కు ఓటింగ్స్ పెరగడం వల్ల హారిక, మోనాల్ ల మధ్య ఎలిమినేషన్ రిస్క్ ఉందని తెలుస్తుంది. మొత్తానికి అవినాష్ ఈ వీక్ సేఫ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని తెలుస్తుంది. అయితే ఈ వారం సేఫ్ అయినా నెక్స్ట్ వీక్ కూడా సేఫ్ అయితేనే టాప్ 5లో ఛాన్స్ దక్కించుకుంటాడని తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: