కొణిదెల నాగబాబు ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. మెగా బ్రదర్స్ లో నిర్మొహమాటంగా ఏదైనా మాట్లాడే వ్యక్తిగా నాగబాబు కనిపిస్తారు. గతంలో తన ఫ్యామిలీ జోలికివచ్చిన ఎవరిని కూడా నాగబాబు అంత ఊరికే వదిలిపెట్టలేదు.. వారికి తగిన సమాధానం ఇచ్చి మరీ వాళ్లకు బుద్ధి చెప్పారు. తమలో తమకు వంద ఉంటాయని అలా అని బయటివారు వచ్చి తమని ఏమన్నా అంటే ఊరుకోమని అయన మీడియా ముందు కూడా చాలా సార్లు చెప్పారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూ లో తన ఫ్యామిలీ గురించి, నిహారిక పెళ్లి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పారు..

మా అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉన్నాయని, ఎవరికీ ఉండవని అన్నారు.. కొన్ని అభిప్రాయభేదాలు అందరి ఇళ్లల్లో ఉండేవే.. అన్నారు. అలాగే వారిమధ్య ఉన్న అనుబంధాన్ని కూడా అయన గుర్తు చేసుకున్నారు. అభిప్రాయం బేధాలు ఉన్నంత మాత్రానా మా మధ్య ప్రేమ తగ్గదని అన్నారు. ఐతే అభిప్రాయ బేధాలు ఉన్నా మా మధ్య ఉండే ప్రేమ మాత్రం కొంచెం కూడా తగ్గదు. ఒక విషయంపై మా ఆలోచనలు వేరైనా కానీ, అన్నదమ్ములుగా ఆ ప్రేమ, అనుబంధం మాత్రం కొంచెం కూడా తగ్గవు అన్నారు.

అదే సాంప్రదాయాన్ని ఇప్పుడు మా పిల్లలు కొనసాగిస్తున్నారని నాగబాబు అన్నారు. కజిన్స్ అయిన చరణ్, వరుణ్, ధరమ్ తేజ్, నిహారిక చాలా అన్యోన్యంగా ఉంటారు. ఒకరికి ఒకరు మద్దతుగా నిలబడతారు. అది అన్నయ్య చిరంజీవి నుండి నేర్చుకున్నారని నాగబాబు అన్నారు.ఇక నిహారిక గురించి యాంకర్ అడుగగా... ఆడపిల్లంటే ఏ తండ్రికి అయినా ఇష్టమే, నిహారిక అంటే నాకు ఇంకా పిచ్చి. నాకు ఆడపిల్ల కావాలని ఎంతో కోరుకుంటే నిహారిక పుట్టింది. నిహారిక నేను బెస్ట్ ఫ్రెండ్స్ వలె ఉంటాము. అయితే పెళ్లి తరువాత నిహారిక గతంలో వలె ఎక్కువగా మాట్లాడం లేదని అన్నారు.ఇక వరుణ్ పెళ్లి విషయానికి వస్తే... అది లవ్ మ్యారేజా లేక అరేంజ్డ్ మ్యారేజా అనే తేడా ఏమీ ఉండదు. అన్నివిధాలా వరుణ్ కి తగిన అమ్మాయా కదా అని చూస్తాం. అమ్మాయి మంచిది అయితే చాలని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: