తెలుగు బిగ్ బాస్ షోతో ఫేమస్ అయిన అతికొద్ది మందిలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఒకరు.. బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొన్న రాహుల్.. ఏకంగా ఆ సీజన్ కి విజేతగా నిలిచి.. ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ ని తెచ్చుకున్నాడు.. ప్రస్తుతం వరుస అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా ఉన్న రాహుల్ ఓ అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడట..ఇంతకీ ఆమె ఎవరు..?అనే విషయాన్ని లోతుగా పరిశీలిస్తే.. బిగ్ బాస్ హౌజ్ లోనే రాహుల్..  పునర్నవితో చాలా క్లోజ్ గా ఉండేవాడు.. ఇక హౌజ్ నుండి బయటికొచ్చాక వీళ్ళిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు.. దానితో పునర్నవి - రాహుల్ పెళ్లి చేసేసుకుంటారేమో అని అంతా అనుకున్నారు.
 
అంతేకాదు పునర్నవితో రాహుల్ కొన్నాళ్ళు జతగానే తిరిగాడు. కానీ తర్వాత ఇప్పుడు అషు రెడ్డి తో రాహుల్ హైలెట్ అవుతున్నాడు. సీజన్ 3 లో అషు రెడ్డి కూడా ఉంది. అయితే బిగ్ బాస్ హౌస్ లో అషు రెడ్డి తో రాహుల్ పెద్దగా కలవకపోయినా.. బయట మాత్రం రాహుల్ అషులు బాగా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. ఈమధ్యన పబ్లిక్ గానే తిరుగుతున్నారు. హాగ్ లు ఇచ్చుకోవడం, అషు ని రాహుల్ ఎత్తుకోవడం అబ్బో వీళ్ళ యవ్వారం మాములుగా లేదు.దానితో రాహుల్ - అషు రెడ్డిల మధ్యన సం థింగ్ సం థింగ్ అంటూ రూమర్స్ మొదలయ్యాయి.కానీ అవి రూమర్స్ కాదు నిజాలే అన్నట్టుగా ఉంది ఇప్పుడు వాళ్ళ బిహేవియర్.ఈమధ్యన ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాహుల్ - అషు రెడ్డిలు ఒకరి కోసం ఒకరు పాట పాడుకున్నారు.
 
అంతేకాదు.. మేమిద్దరం కెమిస్ట్రీ చదువుకుంటున్నాం.. ఫిజిక్స్ అనుకుంటున్నాం, హిస్టరీలు రిపీట్ చేసుకుంటున్నాము అంటూ ఏదేదో అర్ధం పర్ధం లేకుండా మాట్లాడడంతో రాహుల్ అషు రెడ్డితో బాగానే పులిహోర కలుపుతున్నాడని అర్ధమైపోతుంది. అంతే కాదు.. వీరిద్దరూ క్లోజ్ గా ఉన్న ఫొటోస్ చూపిస్తే ఇవెలా బయటికి వచ్చాయి.. అయినా ఈ ఫొటోస్ నథింగ్ ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయ్ అంటూ మాట్లాడడం చూస్తే వీరి మధ్య వ్యవహారం పెళ్లి వరకు వెళ్లేలా ఉందంటున్నారు టాలీవుడ్ జనాలు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: