సూపర్ స్టార్ మహేష్ బబు ప్రస్తుతం "సర్కారు వారి పాట " సినిమా చేస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై మహేష్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే దాదాపుగా 60 శాతం మేర పూర్తయ్యిందని సమాచారం. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చెయ్యనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇక ఈ సినిమా తరువాత మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక ఆ తరువాత మహేష్ నటించే సినిమాపై ఫిల్మ్ సర్కిల్స్ లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

 ముఖ్యంగా అనిల్ రావిపూడి పేరు గట్టిగానే వినిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మహేష్ బాబు కోసం కథ సిద్దంగా ఉందని, మహేష్ తో మళ్ళీ పని చేసేందుకు ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ కాంబినేషన్ దాదాపుగా ఫిక్స్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ సినిమా స్పొర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని సమాచారం. ఇందులో మహేష్ క్రికెట్ కోచ్ గా కనిపిస్తాడట. గతంలో మహేష్ "ఒక్కడు " సినిమాలో కబడ్డీ ప్లేయర్ గా కనిపించిన సంగతి తెలిసిందే.

ఇక అనిల్ రావిపూడి- మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన " సరిలేరు నికెవ్వరు " సినిమా అల్ టైమ్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా మహేష్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ వసూళ్లను అందుకుంది. దాంతో వీరి కాంబినేషన్ పై మహేష్ అబిమానుల్లో స్పెషల్ క్రేజ్ నెలకొంది. మరి ఈ కాంబినేషన్ నిజంగా మరొకసారి సెట్ అయితే అభిమానులకు పండగే అని చెప్పాలి. ప్రస్తుతం అనిల్ " ఎఫ్ 3 " సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత బాలయ్య తో ఓ సినిమా చేస్తాడని సమాచారం. ఆ తరువాత మహేష్ తో చేయబోయే సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: