ప్రతి ఒక్క హీరో కెరీర్ ఎదో ఒక టైం లో ఒక ఫ్లాప్ సినిమా ను చేస్తారు.. అది ఎంతలా ప్రభావితం చేస్తుంది అంటే అయన కెరీర్ లోనే అలాంటి సినిమా చేసి ఉండనంత ప్రభావాన్ని చూపుతుంది.. పెద్ద పెద్ద హీరోలకే ఇలాంటి పరాభవాలు తప్పలేదు.. అలా నితిన్ కెరీర్ లో ఇలాంటి సినిమాలు చాలా ఉన్నాయి.. అయితే ఇటీవలే కాలంలో అయన ని తీవ్రంగా దెబ్బతీసిన చెక్.. అప్పటిదాకా మంచి విజయాలను నమోదు చేసుకుంటూ వచ్చిన నితిన్ విజయ పరంపరకు ఈ చెక్ సినిమా చెక్ పెట్టింది..

వెరైటీ చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఉగ్రవాదం కాన్సెప్ట్ తో చెస్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తొలిరోజే ఫ్లాప్ టాక్ ని తెచ్చుకుంది.. దాంతో రెండో షో కి జనాలు రావడం తగ్గింది.. మంచి వీకెండ్ టైం లో ఏ సినిమా పోటీ లేని సమయంలో రిలీజ్ అయినా ఈ సినిమా ఫ్లాప్ నుంచి గట్టెక్కలేకపోయింది.. ఫలితంగా ఇండస్ట్రీ లోని అతి పెద్ద ఫ్లాప్ ల లిస్ట్ లలో ఒకటిగా మిగిలిపోయింది.. నితిన్ కెరీర్ పై ఈ సినిమా ప్రభావం కొన్ని రోజులు కొనసాగుతుంది.. అందుకే దీని ప్రభావం అయన తదుపరి సినిమా రంగ్ దే పై పడింది..

ప్రియా వారియర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నా నితిన్ కి ఈ కథ ఏమాత్రం సెట్ అవ్వలేదు అన్నది ఆయన ఫ్యాన్స్ అంటున్న మాట.. అయినా హిట్ జోష్ లో ఉన్న టైం లో మరో హిట్ సినిమా చేయకుండా ఇలాంటి కథలను ఎంపిక చేసుకోవడం పట్ల అయన నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.. నితిన్ ఒకసారి దెబ్బతిని మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లో పుంజుకున్నాడు.. మళ్ళీ దేవుడు మళ్ళీ మళ్ళీ ఛాన్స్ లు ఇవ్వడు.. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని హీరో గా నిలదొక్కుకోవాలే కానీ ఇలా చేయడం ఏమాత్రం బాలేదు అని వార్న్ చేస్తున్నారు.. మరో నితిన్ కథల ఎంపిక లలో జాగ్రత్తలు తీసుకుంటాడా చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: