టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో దర్శక ధీరుడు రాజమౌళి తీసిన భారీ పాన్ ఇండియన్ సినిమా R R R. రౌద్రం రణం రుధిరం పేరుతో వ‌స్తోన్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఇప్ప‌టికే ప్ర‌కటించారు. దర్శక ధీరుడు రాజమౌళి  డైరెక్షన్ లో గ‌త రెండున్న‌ర సంవ‌త్స‌రాల నుంచి ఈ సినిమా షూటింగ్ జ‌రుపుకుంటూనే ఉంది. క‌రోనా నేప‌థ్యంలో ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే రెండు, మూడు సార్లు వాయిదాలు ప‌డ‌డం కూడా సినిమా లేట్ కు మ‌రో కార‌ణం.

ఇటీవ‌ల ఓ బీటెక్ స్టూడెంట్ తాను బీటెక్ లో జాయిన్ అయిన‌ప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింద‌ని.. త‌న బీటెక్ అయిపోయినా కూడా ఇంకా ఆర్ ఆర్ ఆర్ పూర్తి కాలేద‌ని కౌంట‌ర్ ఇచ్చాడు. దీనిని బ‌ట్టి ఈ సినిమా ఎంత సుధీర్ఘంగా షూటింగ్ జ‌రుపుకుని.. ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష పెట్టిందో చూస్తూనే ఉన్నాం.

ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన స్టిల్స్‌, సాంగ్స్‌, టీజ‌ర్లు  ,  ఫ‌స్ట్ గ్లింప్స్ సినిమా పై అంచ‌నాల‌ను ఆకాశంలోకి పెట్టేశాయి. ఇక ఇప్పుడు ట్రైల‌ర్ ఎప్పుడు వ‌స్తుందా ? అన్న‌దే పెద్ద ఉత్కం గా మారింది. ట్రైల‌ర్ సినిమాకు నెల రోజు ల ముందు వ‌స్తేనే సినిమాకు మ‌రింత హైప్ వ‌స్తుంద‌ని అంటున్నారు. మ‌న‌కు అందుతోన్న స‌మాచారం ప్ర‌కారం ట్రైల‌ర్ రిలీజ్ కు కూడా రాజ‌మౌళి ముహూర్తం పెట్టేశాడంటున్నారు.

డిసెంబ‌ర్ మొద‌టి వారంలోనే ట్రైల‌ర్ ఉంటుంద‌ని టాక్ వ‌స్తోంది. అయితే చాలా మంది మాత్రం రాజ‌మౌళి ఇంత త్వ‌ర‌గానే ట్రైల‌ర్ కు ముహూర్తం పెట్టేశాడా ? ఈ ట్విస్ట్ ఏంట్రా బాబు అని షాక్ అవుతున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా రు. 450 కోట్ల భారీ బడ్జెట్ తో తెర‌కెక్కుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: