సాదారణంగా సినీ హీరోయిన్లు ప్రేమలో పడటం..కొద్ది రోజులు కలిసి ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ మాకు సెట్ అవ్వలేదు బ్రేకప్ చెప్పడం మళ్ళీ సినిమాల్లో నటిస్తున్నారు. అన్నీ ఇండస్ట్రీలో ఇదే తంతు కొనసాగుతోంది.. ఇప్పటికీ ఎంతో మంది హీరోయిన్లు అదే చేశారు..తాజాగా మరో ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు..ఆ విషయాలు ఎంటో ఇప్పుడు చుద్దాము..


అతిపెద్ద క్యాష్‌ రిచ్‌ క్రికెట్‌ లీగ్‌గా గుర్తింపు తెచ్చుకుంది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌. ఎందరో యువ క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చిన ఈ మెగా క్రికెట్‌ లీగ్‌కు కారకుడు ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.లలిత్‌ మోడీ. ఐపీఎల్‌ సృష్టికర్తగా, ఛైర్మన్‌గా వ్యవహరించిన ఆయనకు సంబంధించిన ఓ విషయం ఇప్పుడు నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రముఖ బాలీవుడ్‌ హీరోయిన్‌ సుస్మితాసేన్‌ ను ఆయన పెళ్లిచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌ ద్వారా ప్రకటించాడు.


సుస్మితతో కలిసి సన్నిహితంగా దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఆయన.. ' మాల్దీవుల్లో షికార్లు కొట్టాక లండన్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్నా. నా బెటర్‌ హాఫ్‌ (సుస్మిత)తో కొత్త జీవితం ప్రారంభించి నందుకు ఎంతో ఆనందంగా ఉంది. చంద్రునిపై తేలియాడుతున్నట్లు ఉంది ' అని ఈ పోస్ట్‌లో రాసుకొచ్చారు మోడీ. ఈ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది...అయితే ఈ పోస్ట్ చేసిన కొద్ది సేపటికే మరో పోస్ట్ షేర్ చేశారు లలిత్ మోడి. 'మేం ఇంకా పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం ఇద్దరం డేటింగ్ లో ఉన్నాం. ఏదో ఒకరోజు తప్పకుండా పెళ్లికుండా చేసుకుంటాం' అని అందులో క్లారిటీ ఇచ్చారు.


సుస్మితా సేన్‌ విషయానికొస్తే మొదట్లో పాక్‌ క్రికెటర్‌ వసీమ్‌ అక్రమ్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరూ కలిసి సహజీవనమూ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ బంధం పెళ్లిపీటలెక్కకుండానే పెటాకులైంది. కొన్నాళ్ల తర్వాత.. సుస్మిత సేన్‌ ప్రముఖ మోడల్‌ రోహ్‌మన్‌తో ప్రేమలో పడింది. అయితే అది కూడా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది


మరింత సమాచారం తెలుసుకోండి: