టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి టాలెంట్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన హను రాఘవపూడి గురించి కొత్తగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దర్శకుడు హను రాఘవపూడి 'అందాల రాక్షసి' అనే మూవీతో దర్శకుడిగా తన కెరీర్ ని మొదలు పెట్టాడు. మొదటి మూవీతోనే హను రాఘవపూడి ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలను అందుకున్నాడు. ఆ తర్వాత ఈ దర్శకుడు కృష్ణ గాడి వీర ప్రేమ కథ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. హను రాఘవపూడి ఆ తర్వాత లై , పడి పడి లేచే మనసు మూవీ లకు దర్శకత్వం వహించాడు. ఈ రెండు మూవీలు కూడా బాక్సాఫీస్ దగ్గర అపజయం పాలయ్యాయి.

ఇలా వరుసగా రెండు మూవీ ల అపజయం తర్వాత హను రాఘవపూడి తాజాగా 'సీతా రామం' అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఆగస్ట్ 5 వ తేదీన విడుదల అయ్యింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన పాజిటివ్ టాక్ ని తెచ్చుకుని ఇప్పటికే జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకుంది. అలాగే ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి హను రాఘవపూడి కి ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా అను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతా రామం మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ దర్శకుడికి డిమాండ్ అదిరిపోయే రేంజ్ లో పెరిగినట్లు,  ఈ దర్శకుడికి ఏకంగా మూడు ప్రొడక్షన్ హౌస్ ల నుండి అదిరిపోయే క్రేజీ ఆఫర్ లు వచ్చినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: