ఈ సినిమాను కూడా అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించడానికి ప్లాన్ చేశారు. ఇక ఎన్టీఆర్ కు కూడా కథ వినిపించడం జరిగింది. అయితే వరుస ప్రాజెక్టుల కారణంగా ఎన్టీఆర్ ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా వెయిటింగ్ లిస్టులో పెట్టారు. ఇక గడిచిన సంవత్సరం నుంచి ఇదే స్క్రిప్ట్ వర్క్ పై పని చేస్తూ ఉన్నారు బుచ్చిబాబు.. ఇక ఇటీవల ఈ సినిమా పూర్తి కథను ఎన్టీఆర్కు వినిపించినట్లు సమాచారం. ఇక ఎన్టీఆర్కు ఈ కథ నచ్చడంతో ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక బుచ్చిబాబు గురువు అయినా సుకుమార్ కూడా ఇందులో కొన్ని సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఇక సుకుమార్ సూచనలు మేరకు బుచ్చిబాబు కథలో కొన్ని మార్పులు చేసుకుని ఎన్టీఆర్ నీ ఒప్పించేతరహాలు కథను సిద్ధం చేశారు. అయితే ఈ సినిమా రెండు సినిమాల తర్వాతే ఉంటుంది అన్నట్లుగా తెలుస్తుంది. అంటే 2023లో ప్రశాంత నీల్ మూవీ ని స్టార్ట్ చేస్తారు.. 2024 లో కొరటాల శివ బుచ్చిబాబు సినిమాలని బ్యాక్ టు బ్యాక్ విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లుగా ఎన్టీఆర్ తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి