ప్రభాస్ హీరోగా తెరకెక్కిన 'ఆదిపురుష్' నుంచి టీజర్ బయటకు వచ్చేసింది. అయోధ్యలో ఈ టీజర్ ఈవెంట్‌ని ప్లాన్ చేశారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.


2023 సంక్రాంతికి 'ఆదిపురుష్' విడుదల కానున్న విషయం తెలిసిందే. సీత పాత్ర లో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తోంది.


టీజర్ రిలీజ్ ఈవెంట్‌ లో ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశాడట.సినిమా చేయడానికి తొలుత భయపడ్డాడనని మొదటి మూడు రోజులూ భయపడుతూనే సినిమా చేశాననీ, ఆ తర్వాత ధైర్యం తెచ్చుకున్నాననీ ప్రభాస్ చెప్పుకొచ్చాడట.


సినిమా చేస్తున్నంతసేపూ భయపడ్డాం, భక్తి తో పని చేశామని ప్రభాస్ కూడా చెప్పాడు. శ్రీరాముడి ఆశీస్సులు తమ సినిమాకి వుంటాయని నమ్ముతున్నానని అన్నాడు ప్రభాస్. ప్రభాస్ ఏంటి.? భయపడటమేంటి.? టీజర్ చూస్తే, ప్రభాస్ ఎందుకు భయపడ్డాడో కూడా అర్థమవుతుంది.


హాలీవుడ్ స్థాయి మేకింగ్ గురించి కాదు.. ఇది శ్రీరాముడికి సంబంధించిన సినిమా. రామాయణం నేపథ్యం లో సినిమా తెరకెక్కిస్తున్నారు. అంటే, ఆ రాముడి పాత్రలో ఒదిగిపోవాలి. దానికోసం చాలా చాలా కష్టపడాలి. ఇదీ ప్రభాస్ చెబుతున్నమాట. అందుకే, ఆ మాత్రం భయపడక తప్పలేదంతే మరి.


ఏమాట కామాటే చెప్పుకోవాలి.. అంతలా భయపడ్డాడు కాబట్టే, అంతలా భక్తితో సినిమా చేస్తున్నాడు కాబట్టే, 'ఆదిపురుష్' అంత బాగా వస్తోందన్నమాట. టీజర్ చూస్తే విషయం అర్థమయిపోవడంలేదూ.మరి.ఇప్పటి కే ప్రభాస్ వరుస సినిమాలతో చాలా బిజీ గా వున్నాడు ఆదిపురుష్ సినిమా కోసం కనీసం రెండు సంవత్సరాలు సమయం కేటాయించారు. చివరికి ఈ సినిమా విడుదల కాబోతుంది. ఫ్యాన్స్ ఎదురు చూపులకు ఇక తెర పడినట్లే. రాముడి పాత్రలో ప్రభాస్ ఒదిగి పోయాడనే చెప్పాలి.రావణాసురిది పాత్రను కొత్తగా డిజైన్ చేసాడు దర్శకుడు ఓం రావత్.సీత పాత్ర కూడా చాలా కొత్త గా అనిపిస్తుంది. ఈ సినిమా కొత్త తరం ప్రేక్షకులకు రామాయణం గొప్పతనం తెలియజేయబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: