తెలుగు నటి అనసూయ భరధ్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. యాంకర్ అనసూయ తాజాగా సోషల్ మీడియా వేదికగా తన ఫొటోస్ ని షేర్ చేసింది. అందులో అనసూయ మల్టీకలర్ డ్రెస్ వేసుకొని కనిపించింది. గవ్వలతో డిజైన్ చేసిన హాట్ అవుట్ ఫిట్ ని వేసుకుని హాట్ లుక్స్ తో స్టిల్స్ ఇచ్చింది. ఇక ఈ ఫొటోస్ ని చూసిన నెటిజన్స్ మామ ఏముంది రాభామ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

అనసూయ నటి మాత్రమే కాదు.. యాంకర్ కూడా. అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం వార్తలలో నిలుస్తుంది. ఈమె ఎప్పుడు త‌న స్టైలిష్‌, హాట్ అవుట్‌ఫిట్స్‌తో అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటూ ఉంటుంది. అనసూయ సినీ ఇండస్ట్రీలోకి రాకముందు ఫిక్స్ లాయిడ్ అనే కంపెనీలో హెచ్. ఆర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసింది. ఆ తర్వాత ఈమె సాక్షి టీవీలో యాంకర్ గా పనిచేసింది. జబర్దస్త్ అనే టెలివిజన్ షోలో కూడా యాంకర్ గా చేసి చాలా మంది ప్రేక్షకుల మనసును దోచుకుంది. ఈ అందాల భామ కొన్ని సినిమాలలో కూడా నటించింది. మన్మధుడు అక్కినేని నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో సహాయక పాత్రలో నటించింది. క్షణం సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. హీరో రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో ముఖ్యపాత్రలో అనసూయ కనిపించింది. పుష్ప సినిమాలో విలన్ పాత్రలో నటించింది. రజాకార్ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది.


అయితే ప్రస్తుతం యాంకర్ అనసూయ అరి సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమా ఒక తెలుగు థ్రిల్లర్ మూవీ. ఈ మూవీకి దర్శకుడు జయశంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా మూవీ మేకర్స్ స్టార్ట్ చేశారు. ఈ సినిమాలో వినోద్ వర్మ, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ నటించారు. అరి సినిమా పూర్తయ్యి రెండేళ్లు కావస్తుంది. కానీ రిలీజ్ అవ్వలేదు.. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఇటీవల డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో ఈ సినిమాలోని థీమ్ సాంగ్ ని రిలీజ్ చేయించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: