బాలీవుడ్ డైరెక్ట‌ర్ రాజ్ నిడిమోరుతో సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత ప్రేమ‌లో ప‌డింద‌ని.. ఇద్ద‌రూ డేటింగ్ చేస్తున్నార‌ని గ‌త కొద్ది రోజుల నుంచి జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌చారంపై రాజ్ మ‌రియు సామ్ స్పందించ‌క‌పోవ‌డం, అలాగే ఖండించ‌క‌పోవ‌డంతో అనుమానాలు మ‌రింత బ‌ల‌ప‌డ్డాయి. అదే స‌మ‌యంలో రాజ్ నిడిమోరు వైఫ్ శ్యామాలి డే సోష‌ల్ మీడియాలో పెడుతున్న పోస్ట్‌లు అందరి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి.


ఇటీవ‌ల క‌ర్మ సిద్ధాంతం గురించి ఓ కొటేష‌న్ పంచుకున్న శ్యామాలి.. తాజాగా న‌మ్మ‌కంపై స్టోరీ పెట్టారు. `నమ్మకం అనేది అన్నిటి కన్నా చాలా విలువైనది. ఒక్కసారి దాన్ని కోల్పోతే ఎన్ని ఆస్తులు పెట్టిన తిరిగి పొందలేరు` అంటూ శ్యామాలి ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. అది కాస్త ప్రస్తుతం వైరల్ గా మారింది. రాజ్‌, సామ్‌ల‌ను ఉద్ధేశించే శ్యామాలి ఈ విధంగా స్టోరీ పెట్టింద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.


కాగా, `స్త్రీ` మూవీ, `ది ఫ్యామిలీ మ్యాన్`, `ఫర్జి`, `సిటాడెల్: హనీ బన్నీ` వంటి వెబ్ సిరీస్‌ల‌తో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న రాజ్ నిడిమోరు.. 2015లో శ్యామలిని వివాహం చేసుకున్నారు. అయితే 2022 లో ఈ జంటకు విడాకులు మంజూరు అయ్యాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. కానీ ఈ విష‌యంపై ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ఇక ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ స‌మ‌యంలోనే రాజ్‌తో స‌మంత‌కు ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ త‌ర్వాత స‌మంత‌, నాగ‌చైత‌న్య విడాకులు తీసుకున్నాడు. చైతు గ‌త ఏడాది శోభిత‌ను వివాహం చేసుకోగా.. స‌మంత మాత్రం సింగిల్ లైఫ్‌నే లీడ్ చేస్తోంది. ఈ మ‌ధ్య కాలంలో సామ్ ప‌దే ప‌దే రాజ్‌తో క‌నిపిస్తుండ‌టంతో డేటింగ్ వార్త‌లు తెర‌పైకి వ‌చ్చాయి. త్వ‌ర‌లో ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతున్నార‌ని ప్ర‌చారం సాగుతుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: