
ఒక దశలో తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం ప్రేమకథల మయమైంది. ఆ టైంలో వచ్చిన ప్రతి లవ్ స్టోరీగా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ఖుషి, చిత్రం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మనసంతా నువ్వే వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సునామీలా వసూళ్ల మోత మోగించాయి. యూత్ ఫుల్ లవ్ స్టోరీలంటే ప్రేక్షకులకు ప్రత్యేక అభిమానం ఏర్పడింది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న నిర్మాతలు, దర్శకులు వరుసగా ప్రేమ కథలతోనే ముందుకు సాగారు. ఈ ట్రెండ్‌లో వెంకటేశ్ లాంటి సీనియర్ హీరో కూడా లవ్ జానర్ లో అడుగుపెట్టి “నువ్వు నాకు నచ్చావ్” లాంటి హిట్ అందుకున్నారు. పవన్ కళ్యాణ్ ఖుషితో సృష్టించిన మ్యాజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈ ప్రేమకథల ట్రెండ్‌కు బలమైన బూస్ట్ ఇచ్చినవారిలో దర్శకుడు తేజ ఓ ప్రత్యేక స్థానం దక్కించుకున్నారు. తేజ రూపొందించిన "చిత్రం" సినిమా ఊహించని స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. చిన్న బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించడం ఇండస్ట్రీకి ఓ షాక్‌లా అనిపించింది. ఈ సినిమాతో పరిచయమైన రీమాసేన్, అనంతరం తేజ తీసిన “నువ్వే కావాలి” చిత్రంతో వచ్చిన రీచా, అలాగే “నువ్వు నేను”లో నటించిన అనిత లాంటి వారు తెలుగుతెరకు మంచి టాలెంట్ గా పరిచయమయ్యారు. కానీ వీరిలో ఎవ్వరూ మాత్రం ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయారు.
ఈ ముగ్గురికంటే ముందుకు దూసుకెళ్లిన హీరోయిన్ ఆర్తీ అగర్వాల్. “నువ్వు నాకు నచ్చావ్” సినిమాతో వెంకటేశ్ సరసన ఎంట్రీ ఇచ్చిన ఆమె, మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. పెద్ద బ్యానర్ అయిన సురేష్ ప్రొడక్షన్స్, స్టార్ హీరో వెంకటేశ్, హిట్ డైరెక్టర్ కె. విజయ భాస్కర్ అనే కాంబినేషన్ ఆమెకు ఫేమ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత వరుసగా ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయి. “నువ్వులేక నేను లేను”, “సోగ్గాడు”, “ఇంద్ర”, “బాబు”, “వారసుడు” వంటి సినిమాల్లో నటించి, వెంకటేశ్, చిరంజీవి, నాగార్జున వంటి స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం దక్కించుకుంది. ఆర్తీ ఎఫెక్ట్‌తో ఎంతో ఫ్యూచర్ ఉంటుందనుకున్న రిమాసేన్, అనిత కెరీర్ టాలీవుడ్‌లో మటాష్ అయిపోయింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు