
విశాల్ మాట్లాడుతూ – “నేను ఇప్పుడు ఒక కొత్త జర్నీని ప్రారంభించబోతున్నాను. దీని పేరు ‘యూవర్స్ ఫ్రాంకీ విశాల్’. ఈ ప్లాట్‌ఫార్మ్ ద్వారా నా ఆలోచనలను, నా అనుభవాలను, నా మనసులో ఉన్న నిజాయితీ మాటలను మీతో పంచుకుంటాను. ఇందులో మీకు కావలసిన అన్ని రకాల కంటెంట్ ఉంటుంది,” అని తెలిపారు. తన కెరీర్‌లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెబుతూ, “నా శరీరంపై ఇప్పటివరకు ఒకటి కాదు రెండు కాదు, మొత్తం 119 చోట్ల గాయాలు పడ్డాయి. యాక్షన్ సీన్స్‌లో రియలిస్టిక్‌గా నటించాలనే ప్రయత్నంలో చాలాసార్లు బలంగా గాయపడ్డాను. ఇటీవల చేతికి లోతైన గాయం కావడంతో 17 కుట్లు వేయాల్సి వచ్చింది. అయినప్పటికీ నేను నా పనిపై ప్యాషన్ కోల్పోలేదు. ఇక నుంచి సేఫ్టీ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటాను,” అని చెప్పారు.అయితే ఆయన చేసిన నేషనల్ అవార్డ్స్‌పై వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి.
విశాల్ మాట్లాడుతూ –“నాకు అవార్డులు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. వాటిపై నమ్మకం కూడా లేదు. నేను ఎంత కష్టపడి సినిమా చేసినా, కేవలం ఎనిమిది మంది కూర్చొని నిర్ణయం తీసుకోవడం న్యాయం కాదు. కోట్లాది మంది ప్రేక్షకులు ఒక సినిమాను ఇష్టపడతారు. కానీ ఆ సినిమాను ఎనిమిది మంది ఎలా తీర్పు చెబుతారు? జాతీయ అవార్డులకూ ఇదే వర్తిస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. నాకు అవార్డు రాకపోవడం వల్లనే నేను ఇలా అనడం లేదు. అవార్డు వచ్చినా కూడా నేను దాన్ని చెత్తబుట్టలో వేసేస్తాను,” అని స్పష్టంగా చెప్పారు.
విశాల్ చేసిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. కొందరు నెటిజన్లు ఆయనపై విమర్శలు చేస్తుంటే, మరికొందరు మాత్రం “విశాల్ నిజాయితీగా మాట్లాడాడు, తన మనసులో ఉన్నది బయటపెట్టాడు” అంటూ సపోర్ట్ చేస్తున్నారు.ఇక ఇండస్ట్రీ వర్గాల దృష్టిలోకి వస్తే — విశాల్ లాంటి హీరో ఇలా ఓపెన్‌గా నేషనల్ అవార్డ్స్ సిస్టమ్‌పై ప్రశ్నించడం నిజంగా ధైర్యమైన విషయం అని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం “ఇలా మాట్లాడడం ఆయనకు భవిష్యత్తులో ప్రొఫెషనల్‌గా నష్టమవుతుందేమో” అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.