బండ్ల గణేష్ .. ఈ పేరు వినగానే గూస్బంప్స్ వచ్చేస్తాయ్.  సాధారణంగా ఒక స్టార్ హీరోకి, ఒక స్టార్ హీరోయిన్‌కి.. లేదా ఒక బిగ్ డైరెక్టర్‌కి మాత్రమే ఇలాంటి ఎలివేషన్స్ ఉంటాయి. కానీ టాలీవుడ్‌లో ఒక నిర్మాతకు కూడా అంతటి రేంజ్ ఉండొచ్చని చూపించిన వ్యక్తి బండ్ల గణేష్.  నటుడిగా, నిర్మాతగా — తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ఆయన. తన మాటలలో ఎప్పుడూ మొహమాటం ఉండదు. ఎదుటివాడు ఎంత పెద్దవాడైనా సరే ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాడు — ఇదే బండ్ల గణేష్ స్పెషాలిటీ. అందుకే ఆయన మాట్లాడిన ప్రతీ మాట సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతుంది.  దీపావళి సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తానికి ఒక గ్రాండ్ పార్టీని ఆర్గనైజ్ చేసిన బండ్ల గణేష్, మరోసారి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఆ పార్టీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వేడుకకు ఒక ప్రముఖ నిర్మాతను ఆహ్వానించకపోవడంతో, ఆయన పేరు నెగిటివ్‌గా ట్రెండ్ కావడం కూడా హాట్ టాపిక్‌గా మారింది.

ఇదంతా పక్కన పెడితే.. ఈ సెలబ్రేషన్ లో ఇప్పుడు బండ్ల గణేష్ చేసిన ఒక కామెంట్ మాత్రం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఆయన మాట్లాడుతూ .. “భారతీయ సినీ పరిశ్రమలో తదుపరి ‘అల్లు అర్జున్’ ఎవరు అంటే, నా సమాధానం ఒక్కటే – తేజ సజ్జ!” అని చెప్పారు. ఆ వ్యాఖ్యలు వినగానే అక్కడున్న వారందరూ హర్షధ్వానాలతో చప్పట్లు కొట్టారట. ఆయన  మాట్లాడుతూ.. “తేజ సజ్జ మంచి టాలెంట్ ఉన్న నటుడు. మిరాయ్ తో మంచి హిట్ అందుకున్నాడు. ‘జాంబీ రెడ్డి 2’ కోసం ఎంత కష్టపడుతున్నాడో నేను చూశాను. ఆ కృషి, ఆ డెడికేషన్‌ను బట్టి చూస్తే, భవిష్యత్తులో ఆయన తప్పకుండా మరో అల్లు అర్జున్‌లా ఇండస్ట్రీకి వెన్నెముకగా నిలుస్తాడు” అని ధీమాగా అన్నారు.

బండ్ల గణేష్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు తేజ సజ్జ పేరు, అల్లు అర్జున్ పేరు, బండ్ల గణేష్ పేరు — ముగ్గురు పేర్లతో  సోషల్ మీడియాలో కొత్త హంగామా మొదలైంది.ఫ్యాన్స్ రియాక్షన్ చూస్తే.. బండ్ల గణేష్ మాటలతో తేజ సజ్జ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. చాలా మంది కామెంట్స్‌లో “తేజ సజ్జ నిజంగానే ఫ్యూచర్ ఐకాన్ అవుతాడు” అని రాస్తున్నారు. మరి మీరు ఏమనుకుంటున్నారు? బండ్ల గణేష్ చెప్పినట్టే — తేజ సజ్జ నిజంగా ‘నెక్స్ట్ అల్లు అర్జున్’ అవుతాడా? తన టాలెంట్, డెడికేషన్‌తో బన్నీ లెవెల్‌కి చేరుకోగలడా?.మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి..!
 

మరింత సమాచారం తెలుసుకోండి: