తెలుగు ఎన్నారై కి యూకే లో ప్రతిష్టాత్మక రెండు జాతీయ అవార్డులు దక్కాయి. వెన్నెముక చికిత్స లో విశేషంగా కృషి చేసినందుకు గాను తెలుగు ప్రవాసీయుడు డాక్టర్ శ్రీధర్ కొల్లి ని ఈ అవార్డులు వరించాయి. ఈ నెల 11న విలియమ్స్ ఎఫ్1 కాన్ఫరెన్స్ సెంటర్ లో జరిగిన అవార్డుల ప్రధాన కార్యక్రమంలో  ప్రిన్సెస్ అన్నే  చేతుల మీదుగా ఈ రెండు అవార్డులు అందుకోనున్నారు.

 Image result for back pain

వెన్నెముక నొప్పితో భాదపడుతున్న రోగులకి ఇచ్చిన సేవాలకి గాను ఈ ప్రతిష్టాత్మక స్టీఫెన్ బ్రాడ్షా అవార్డ్ తో సత్కరించారు. ఈ అవార్డ్ తో పాటుగా హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా శ్రీధర్ కొల్లి ని వరించింది.  వెన్నెముక చికిత్సలో అత్యంత ప్రతిభ కనబరిచిన వారికి మాత్రమే ఈ అవార్డులు అందచేస్తారు.

 

డాక్టర్ శ్రీధర్ కొల్లి తెలంగాణా వాసి.  నిజామాబాద్ లో చదివిన శ్రీధర్, ఉన్నత విద్య కోసం వారణాసి లోని బనారస్ యూనివర్సిటీలో చేరారు. పై చదువులకి  అమెరికా వెళ్లారు. చివరిగా ఆయన యూకే లో స్థిరపడ్డారు. ప్రస్తుతం యూకే లోని రూక్‌వుడ్ ఆసుపత్రిలో సేవలని అందిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: