ఎప్ప‌టి నుంచో పోరాడుతున్న ఆర్ఆర్ఆర్ తన పంధాను మాత్రం మార్చుకోవ‌డం లేదు. తెర‌వెనుక ఉన్న శ‌క్తుల సాయంతో జ‌గ‌న్ పై అదే ప‌నిగా పిటిష‌న్ల మీద పిటిష‌న్ల‌ను తెలంగాణ కోర్టులోనూ, నాంప‌ల్లి సీబీఐ కోర్టులోనూ దాఖ‌లు చేస్తూనే ఉన్నారు. ఈ త‌ర‌హా ఆయ‌న సాధించేది ఏమీ లేద‌ని ఎంత‌మంది చెబుతున్నా విన‌డం లేదు. అదే పనిగా సాయిరెడ్డిని, జ‌గ‌న్ ను తిడితే వ‌చ్చే లాభం ఏ ముంద‌ని ఎంత మంది న‌చ్చ‌జెప్పినా ఎందుక‌నో ఆ య‌న ప‌ట్టించుకోవ‌డం లేదు. అకారణ కోపం కార‌ణంగా వైసీపీ పై బుర‌ద జ‌ల్లు తున్నార‌ని కొంద‌రు ఆర్ఆర్ఆర్ ను ఉద్దేశించి అంటున్నారు. అక్ర‌మాస్తుల కేసుల‌కు సంబంధించి కోర్టు ప‌రిధిలో ఉన్న అన్ని విషయాలపై ఎప్ప‌ టిక‌ప్పుడు న్యాయ నిపుణుల‌తో మాట్లాడి పిటిష‌న్లు వేయ‌డం మిన‌హా ఆయ‌న సాధించేదేమీ లేద‌ని ఇప్ప‌టికే తేలి పోయింది. అయినా కూడా ఆయ‌న పంతం నెగ్గించుకోవాల‌న్న తాప‌త్ర‌యంలో ఉన్నారు.

బీజేపీ, జ‌గ‌న్ మ‌ధ్య మిత్రత్వం చెడ‌లేదు. ఆ ఇద్ద‌రి బంధాన్ని ఎవ్వ‌రూ చెడ‌గొట్ట‌లేదు. విడ‌దీయ‌లేదు. రేపు జ‌గ‌న్ క్యాబినెట్ స‌మా వేశం నిర్వ‌హించ‌నున్నారు. కొన్ని కీలక నిర్ణ‌యాలు ఇవ్వ‌నున్నారు. ఇవి మిన‌హా జ‌రిగేదేం ఉండ‌దు. ఆర్ఆర్ఆర్ కోరుకున్న విధంగా కోర్టులు ఉండ‌వు. పిటిష‌న్ వేసిన ఆర్ఆర్ఆర్ కొన్ని ఊహాజ‌నితాల‌ను కోర్టు ముందు ఉంచార‌ని తేలిపోయింది. ఇటువంటి ఊహ లను కోర్టు ప‌ట్టించుకోదు క‌నుక ఈ కేసులో కూడా తీర్పు వాయిదా ప‌డ‌వ‌చ్చు ఈ రోజు లేదా ఆర్ఆర్ఆర్ పిటిష‌న్ కోర్టు కొట్టివేయనూవ‌చ్చు.


అక్ర‌మాస్తుల కేసులో జ‌గ‌న్ కు కోర్టు మంజూరు చేసిన బెయిల్ ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజు దాఖ లు చేసిన పిటిష‌న్ పై తీర్పు నేడు వెలువ‌డ‌నుంది. మ‌రికొద్దిసేప‌ట్లో ఆ వివ‌రం ఏంట‌న్న‌ది తేల‌నుంది. జ‌గ‌న్ తో పాటు విజ‌య్ సా యిరె డ్డి బెయిల్ కూడా ర‌ద్దు చేయాల‌ని ఎప్ప‌టి నుంచో న్యాయ పోరాటం చేస్తున్నారు. దీనిపై కూడా కోర్టు తీర్పు చెప్ప‌నుంది. ఈ రెండు పిటిష‌న్ల‌తో పాటు ఆర్.ఆర్.ఆర్ మరో పిటిష‌న్ నిన్న వేశారు తెలంగాణ హైకోర్టులో! దీని ప్ర‌కారం సీబీఐ కోర్టులో బెయిల్ ర‌ద్దు పిటి ష‌న్ పై వాదోప‌వాదాలు చేసే క‌న్నా ఏద‌యినా క్రిమిన‌ల్ కోర్టుకు ఈ కేసును త‌ర‌లించి, అక్క‌డే దీనిపై తీర్పు ఇవ్వాల‌ని కోరారు ఆర్ఆర్ఆర్ . దీనిపై కూడా తెలంగాణ హై కోర్టు ఈ రోజే స్ప‌ష్ట‌త ఇవ్వ‌నుంది. ఇవే కాకుండా సాక్షి కోర్టు ధిక్క‌ర‌ణ కేసు కూడా నేడే వి చార‌ణ‌కు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

ap