అదిరిపోయే నిర్ణయాలు, అద్భుతమైన పథకాలతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే జగన్ ఓ వైపు ప్రభుత్వాన్ని సమర్ధవంతంగా నడుపుతూనే, మరోవైపు పార్టీకి కూడా తగిన ప్రాధాన్యం ఇస్తున్నారు. నేతలకు తగిన ప్రాధాన్యత ఇస్తూ పదవులు కట్టబెడుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల ముందు పార్టీలో చేరిన కొందరు నేతలకు ఇచ్చిన హామీలని కూడా జగన్ వరుసగా నిలబెట్టుకుంటూ వస్తున్నారు.


అయితే ఎన్నికల ముందు అమలాపురం ఎంపీగా ఉన్న పండుల రవీంద్రబాబు కూడా వైసీపీలో చేరారు. 2014లో టీడీపీ తరుపున ఎంపీగా గెలిచిన పండుల....మొన్న ఎన్నికల ముందు టీడీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసి, జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆ సందర్భంలో పండుల అమలాపురం ఎమ్మెల్యే స్థానం అడిగారు. కానీ అప్పటికే ఆ స్థానాన్ని ప్రస్తుతం మంత్రిగా ఉన్న పినిపే విశ్వరూప్ కు ఇస్తానని హామీ ఇచ్చేశారు. దీంతో ఆయనకు సీటు ఇవ్వడం కుదరలేదు.


దాంతో పండుల మళ్ళీ టీడీపీలో చేరేందుకు చూస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి. అయితే జగన్ పండులకు రాజ్యసభ ఇస్తానని హామీ ఇచ్చారు. ఒకవేళ రాజ్యసభ కుదరకపోతే ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పినట్లు తెలిసింది. దీంతో పండుల వైసీపీలోనే కొనసాగి అమలాపురం పరిధిలో వైసీపీ అభ్యర్ధుల విజయానికి కృషి చేశారు. ఇక ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు అవుతుంది. పండులకు ఇంకా ఏ పదవి దక్కలేదు. ఆయన కూడా పార్టీలో పెద్దగా కనిపించడం లేదు. మొన్న ఆగష్టులో మూడు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ అయ్యాయి. అప్పుడు పండుల పేరు కూడా వచ్చింది గానీ పదవి దక్కలేదు. మరి చూడాలి జగన్ రానున్న రోజుల్లో పండులకు ఏ పదవి ఇస్తారో?



మరింత సమాచారం తెలుసుకోండి: