ఆర్టీసీలో ప్రైవేటీక‌ర‌ణ‌..స‌మ్మె విష‌యంలో కఠిన నిర్ణ‌యాల‌తో ముందుకు సాగుతున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ క్ర‌మంలో రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌కు సైతం ప్రాధాన్య‌త ఇస్తున్నారు. త‌న‌ను ఇర‌కాటంలో ప‌డేయాల‌ని చూస్తున్న బీజేపీ, టీఆర్ఎస్‌ల‌ను సైతం టార్గెట్ చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప‌రిపాలిస్తున్న రాష్ట్రాల్లోనూ ఆర్టీసీ లేద‌ని ఆరోపిస్తున్న ఆయ‌న దేశంలోని చాలా రాష్ట్రాలు ప్రైవేట్ బస్సులతో ఆర్టీసీని నడిపిస్తున్నాయన్నారు. కేంద్రం తెచ్చిన యాక్ట్ ప్రకారమే 5100 ప్రైవేటు బ‌స్సులు అందుబాటులో ఉంచాల‌ని క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. తద్వారా బీజేపీని టార్గెట్ చేశారు. 


ఆర్టీసీని ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభుత్వంలో విలీనం చేయడం కుదరదని క్యాబినెట్ ఆమోదం తెలిపింద‌ని కేసీఆర్ అన్నారు. బ్లాల్ మెయిల్ రాజకీయాలు జ‌ర‌గ‌కూడ‌ద‌ని కోరుకుంటూ... క్యాబినెట్ నిర్ణయంపై ఎలాంటి మార్పులు ఉండవని తేల్చిచెప్పారు. `` ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 10,600 రూట్లలో ఇప్పటికే 5,100 రూట్లను ప్రైవేట్ పరం చేసేందుకు నిర్ణయం తీసుకున్నాం. గడువులోపు విధులకు ఎవరూ రాకపోతే మిగతా రూట్లను కూడా ప్రైవేట్ పరం చేస్తాం. ఇది నా ఒక్క‌డి నిర్ణయం కాదు. క్యాబినెట్ నిర్ణయంని.. ఇందులో ఏ మార్పు ఉండ‌దు. ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం లేదు. లాభాలు వచ్చే రూట్లలో ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. గ్రామాల్లో ప్రైవేట్ బస్సులు నడుస్తాయి. నష్టాల్లో నడిచే రూట్లలో ప్రైవేట్ కి ఇవ్వాలని విజ్ఞప్తులు వచ్చాయి. కేంద్రం తెచ్చిన యాక్ట్ ప్రకారమే క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.  ప్రైవేట్ బస్సులు సైతం ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. బస్‌ పాసులు అన్ని కొనసాగుతాయి.  కార్మికుల ఉద్యోగాలకు రక్షణగా ఉంటుంది. ప్రైవేట్ రూట్లు ఇచ్చింది విధాన నిర్ణయం మాత్రమే. దేశంలోని చాలా రాష్ట్రాలు ప్రైవేట్ బస్సులతో ఆర్టీసీని నడిపిస్తున్నాయి`` అని తెలిపారు. 

ఆర్టీసీ తరహాలో 92 కార్పొరేషన్స్ ఉన్నాయ‌ని తెలిపిన ముఖ్య‌మంత్రి కేసీఆర్‌...వీరిని విలీనం చేస్తే వాళ్ళు డిమాండ్ చేస్తారని  అన్నారు. ప్రతిపక్షాల మాట పట్టుకొని సమ్మెలో కొనసాగుతున్నారని కేసీఆర్ మండిప‌డ్డారు. 5వ తేదీ నవంబర్ లోపు కార్మికులు రీ జాయిన్ కాకపోతే మిగతా రూట్లలో కూడా ప్రైవేటికరణ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: