ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలకు చేరువ అవుతోంది. ఏపీలో ఆదాయం లేదు, నిధుల కొరత ఉంది. కేంద్రం వివక్ష అలాగే ఉంది. ప్రత్యేక హోదా లేదు, కేంద్రంలోని బీజేపీ నేతలకు కూడా రాజకీయం కావాలి. ఇవన్నీ ఇలా ఉంటే జగన్ సర్కార్ మాత్రం వచ్చిన నాటి నుంచి కష్టపడుతోంది. వరసగా అనేక కార్యక్రమాలకు జగన్ శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే..


తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ జగన్ ఒక్కరే కష్టపడుతున్నారు. మంత్రులు చూసుకుంటే పెద్దగా పట్టించుకోవడంలేదు అన్న భావన నెలకొంది. ముఖ్యంగా ఇసుక విషయంలో ప్రభుత్వం మంచి పాలసీ తీసుకువచ్చింది. అక్రమార్కుల,  మాఫియా లీడర్ల ఆట కట్టించేందుకు ఈ విధానన్ని ఆన్ లైన్ చేసింది. అయినా కూడా ఇసుక బ్లాక్ లో తరలిపోతోందన్న దాని మీద నిశితంగా పరిశీలన చేసి కొన్ని అరెస్టులు కూడా చేసింది. అయితే ఏపీలో ఒక్క ఇసుక రేణువు కూడా లేదన్నట్లుగా తెలుగుదేశం ఇసుక పొరాటం అంటూ డ్రామాలు ఆడితే, దానికి పవన్ కళ్యాణ్ సైతం తందానా అంటున్నారు. ఇక టీడీపీ అనుకూల మీడియా ఇసుక ప్రధాన సమస్య అన్నట్లుగా మొదటి పేజీల్లో రాతలు రాస్తూ వచ్చింది. నిజానికి ఇంతటి వరదల్లో కూడా 250 ఇసుక రీచులు ఉంటే 60 కి పైగా రీచుల నుంచి ఇసుక రోజూ సరఫరా చేస్తున్నారు.


రోజూ అరవై వేల టన్నుల ఇసుక సరఫరా అవుతోంది. మరో వైపు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను గత ప్రభుత్వం పట్టించుకోకుండా వందల కోట్ల పెనాల్టీ వేయించుకుంది. దానికి జనం కట్టిన పన్ను రూపేణా కట్టాల్సివస్తోంది. ఇలాంటి మొట్టికాయాలు తినయకుండా జగన్ సర్కార్ జాగ్రత్తగా ఇసుక రీచుల నుంచి ఇసుకను తీస్తోంది. ఇక వరదలు రెండు నెలలుగా ఏపీలో వున్నాయి. అంతకు ముందు ఇతర రాష్ట్రాల్లో కూడా వరదలు వచ్చి ఏపీలోని జలాశయాలు పొంగాయి. దాంతో ఇసుక తీయడం కష్టంగా మారింది. 


ఇదీ కదా అసలు విషయం. మరి దీన్ని జనాలకు ఎవరు చెప్పాలి. వైసీపీ సర్కార్ కి మీడియా మద్దతు లేదు. కానీ చేతిలో ప్రభుత్వం ఉంది కదా మంత్రులు ఏం చేస్తున్నట్లు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్లు, 150 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్లు, సీనియర్ పార్టీ నాయకులు ఏం చేస్తున్నట్లు, వారు జనాలకు ఈ సంగతి చెప్పారా, అసలు విషయం వివరించి బోధపరచారా. ఇవన్నీ లేవు. మరో వైపు చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా రెచ్చిపోతోంది. ఇక ఇపుడు పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ అంటే గంటల తరబడి లైవ్ ఇచ్చేశారు.



అంటే జగన్ని  కేవలం అయిదు నెలలలో ఓ ఫెయిల్యూర్ సీఎం గా, అసమర్ధుడుగా చిత్రీకరించేందుకు బాబు డైరెక్షన్లో పెద్ద స్కెచ్ రెడీ అవుతూంటే మాట్లాడకుండా మౌనం వహించే వైసీపీ క్యాబినెట్ దే ఈ తప్పు.  వైసీపీది ఓ పార్టీగా అతి పెద్ద ఫెయిల్యూర్. ఒక్క మాట ఇది ఆరంభం   మాత్రమే. ఇప్పటికైనా జగన్ మంత్రులు, పార్టీ నాయకులు కళ్ళు తెరవకపోతే ఏదో ఒక దాన్ని పట్టుకుని రోడ్డు మీదకు వచ్చేందుకు విపక్షాలు రెడీగా ఉంటాయి. మరి జగన్ ఈ విషయంలో తన పార్టీని, ప్రభుత్వాని ఎలా నడిపిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: