మనుషులకు స్మశానవాటికలు  ఉండటం సహజం. స్మశాన వాటిక లను ఏర్పాటు చేసి మనుషులకి సమాధిలను ఏర్పాటు  చేయడం ద్వారా మనసులకు సంబంధించిన గుర్తులను అలాగే ఉంచుకొని స్మరించుకోవటానికి  వీలుంటుంది. అయితే చేపలకు స్మశానవాటికలు  ఉండడం ఎప్పుడైనా విన్నారా... చేపలకు స్మశానవాటికలు  ఉండటం ఏమిటి అంటారా. నేను చెప్పే వార్త నిజమేనండి. ఇక్కడ చేపలకు స్మశానవాటికలు  ఏర్పాటు చేసి సమాధులను నిర్మిస్తున్నారు. అంతరించిపోతున్న చేపలకు సమాధుల నిర్మించి స్మరించుకోవాల్సిన  అవసరం ఉందని వారు తెలుపుతున్నారు. ఇంతకీ ఇది ఎక్కడ అనుకుంటున్నారా... కేరళ రాష్ట్రంలో. కేరళలో మత్స్యశాఖ జాతికోసం స్మశాన వాటిక ఏర్పాటుచేసి సమాధుల నిర్మిస్తున్నారు. 

 


 ప్రస్తుతం రోజురోజుకూ పెరిగిపోతున్న జల పర్యావరణ కాలుష్యం వల్ల కొన్ని అరుదైన రకాల జలచరాలు అంతరించిపోయే ప్రమాదం ఏర్పడిందని... వాటిని భవిష్యత్తులో ఇక చూడమని వాటికి సమాధానాలు నిర్మించి స్మరించుకోవాల్సిన  అవసరం ఉందని అభిప్రాయపడింది... కేరళలోని పర్యావరణ ప్రేమికులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కోజికోడ్ జిల్లా వేల్పూరు తీరంలో జలచరాల కోసం ఒక స్మశానవాటికను  ఏర్పాటు చేశారు. స్మశాన వాటికలో  రోజురోజుకూ పెరిగిపోతున్న కాలుష్యం తో అంతరించిపోతున్న జలచరాలకు సంబంధించిన సమాదులను  నిర్మిస్తున్నారు. సముద్ర గుర్రం, చిలుక చేపా, హామర్  హెడ్ పార్క్,  లెదర్ బ్యాగ్  తాబేలు, దూగాంగ్,  షాఫిష్,  ఈగ్రే జిబ్రా షార్క్... లాంటి జలచరాలన్ని  అంతరించిపోతున్న తరుణంలో వాటికి సమాదులను  నిర్మిస్తున్నారు. 

 

 అయితే ఈ సమాధులు కూడా ఇలా నిర్మిస్తున్నారో  తెలుసా... ఇనుప చట్రంలో వాడి పారేసిన ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను  ఉంచి  స్మశాన వాటిక నిర్మిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పర్యావరణ ప్రేమికులు అందరూ.. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ఎంత ముప్పు కలుగుతుందో తెలియజేయడంతో పాటు.. అంతరించిపోతున్న జలరాశిలో గురించి కూడా ఒకే సమయంలో అవగాహన కలిగించేలా నిర్ణయం తీసుకున్నారు. కాగా కోజికోడ్ జిల్లా అధికారులు,  జైపూర్ పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు,  జెల్లీఫిష్ వాటర్ స్పోర్ట్స్ సంస్థ ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: