ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ రాధాకృష్ణకూ వైఎస్ జగన్ కూ ఉన్న శత్రుత్వం బహిరంగ రహస్యమే. జగన్ పైనే కాదు.. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విషయంలోనూ ఇదే రాధాకృష్ణ ఇంతకంటే ఎక్కువ వైరమే ప్రదర్సించారు. అంతే కాదు.. ఆ విషయాన్ని తన పత్రిక సంపాదకీయాల్లోనే అనేక సార్లు రాసుకున్నారు. అయితే.. జగన్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఆయన జైలుకు వెళ్లేందుకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కారణమయ్యారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

 

ఎందుకంటే.. జగన్ పై సీబీఐ కేసుల సమయంలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అనేక సార్లు అప్పటి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణతో ల్యాండ్ లైన్ ఫోన్లో మాట్లాడారట. జగన్ కేసు విషయంలో నిత్యం సంప్రదింపులు జరిపారట. ఈ విషయాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బయటపెట్టారు. ఈ మేరకు ఆయన హోం మంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో వివరించారు. గతంలో చంద్రబాబు సీబీఐలో తన మనుషులతో జగన్ ను ఇబ్బంది పెట్టారని.. ఇప్పుడు మరోసారి ఆ ప్రయత్నం జరుగుతోందని విజయసాయిరెడ్డి అనుమనిస్తున్నారు.

 

ఈ మేరకు తన అనుమానాలను వివరిస్తూ హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఆ లేఖలో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ గురించి ప్రత్యేకించి ప్రస్తావించారు. ఆయన రాధాకృష్ణ గురించి అమిత్ షాకు రాసిన లేఖలో ఏం రాశారంటే.. “ గతంలో సీబీఐ జేడీగా ఉన్న లక్ష్మీనారాయణ, చంద్రబాబునాయుడుతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఇబ్బందులు సృష్టించేందుకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ద్వారా చంద్రబాబు నాటి జేడీ లక్ష్మీనారాయణకు ఆదేశాలు జారీ చేశారు.

 

ల్యాండ్ లైన్ ఫోన్ ద్వారా అనేక సార్లు లక్ష్మీ నారాయణ.. చంద్రబాబుతో మాట్లాడారు. చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా వైయ‌స్ జగన్‌కు ఇబ్బందులు సృష్టించారు. లక్ష్మీనారాయణ తప్పుడు ప్రవర్తన, రాజకీయాలపై సీబీఐలో అంతర్గత విచారణ సైతం జరిగింది.. అని రాశారు విజయసాయిరెడ్డి. మరి దీనిపై రాధాకృష్ణ ఏమైనా స్పందిస్తారా..?

మరింత సమాచారం తెలుసుకోండి: