రాజకీయాల్లో వినిపించే మాటలు ఒక్కోసారి తమ స్దాయిని దాటి కూడా బయటకు వస్తాయి. అక్కడ తప్పు ఎంతవరకు జరుగుతుందనే విషయన్ని పక్కన పెడితే, తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికే నాయకులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తారు. ఇలా ఇప్పుడు ఏపీలోని రాజకీయాల్లో పలువిధాలైనా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఏపీ రాజధాని విషయంలో మొదలైన సమస్య ఇంతవరకు ఒక కొలిక్కి రాలేకపోతుంది. రాజధాని విషయం రోజు రోజుకు ముదిరిపోతున్నట్లుగా కనిపిస్తున్న నేపధ్యంలో పలువురు నాయకులు, విభిన్న అభిప్రాయాలను వినిపిస్తున్నారు.

 

 

ఇకపోతే ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి వచ్చిన తర్వాత బిజెపి రాజ్యసభ సభ్యుడు 'సుజనాచౌదరి' తీవ్రంగా స్పందించారు. ఒకరకంగా 'జగన్‌' నిర్ణయాన్ని బాహాటంగా వ్యతిరేకించి రాజధాని రైతులకు సంఘీభావం తెలిపారు. ఇదే కాకుండా రాజధాని అభివృద్ధికి కేంద్రం రూ.1500 కోట్లు ఇచ్చిన, ఇంకా రాజధాని నిర్మాణానికి కావలసిన నిధులు తెచ్చుకోవడంలో గత టీడీపీ ప్రభుత్వం, ఇప్పటి వైసీపీ సర్కార్ ఫెయిలయ్యాయని పేర్కొన్నారు.. అయితే ఇలాంటి కొన్ని ప్రకటనలు చేసిన తర్వాత 'చౌదరి' మళ్లీ వార్తల్లో కనిపించలేదు.

 

 

మరో వైపు ఈ సమస్య కేంద్ర పరిధిలో లేదన్న 'జివిఎల్‌' మాత్రం ఇదే అంశంపై ప్రతిసారీ స్పందిస్తు, వైకాపా ప్రభుత్వం చర్యలను పరోక్షంగా సమర్థిస్తూ వచ్చారు. దీంతో 'జివిఎల్‌' చెప్పేదే కేంద్ర ఆలోచన కావచ్చనే అభిప్రాయాలు ఇప్పుడు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. ఇకపోతే రాజధాని, శాసనమండలి విషయంలో పదే పదే 'జివిఎల్‌' ప్రస్తావిస్తుంటే.. 'సుజనాచౌదరి' మాత్రం ఎందుకు స్పందించడం లేదనే విషయం మాత్రం ఏపీలో ఇప్పుడు ప్రత్యేక చర్చలా మారింది. మరొక వాదన ఏంటంటే బిజెపి అధిష్టానం సుజనా నోరును నొక్కేసిందని, ఈ విషయంలో గట్టిగా వార్నింగ్ ఇవ్వడం వల్లే సుజనా మౌనాన్ని ఆశ్రయించారని గుసగుసలు వినిపిస్తున్నాయి..

 

 

కాగా శాసనసభలో 'మండలి' రద్దుపై ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి 'సుజనాచౌదరి'ని ఉద్దేశించి ఆయనను తన్ని బిజెపి నుంచి బయటకు పంపించాలని వ్యాఖ్యానించినా... 'చౌదరి' మౌనాన్నే ఆశ్రయించారు. అంటే మొత్తం మీద..రాజధాని వ్యవహారంలో 'సుజనా' మనోభావాలకు వ్యతిరేకంగా 'ఢిల్లీ' వర్గాలు ఉన్నాయని, ఇదే కాకుండా ఆయన ప్రాధాన్యత కూడా తగ్గిందనుకుంటున్నారు.. అందువల్లే ఇప్పుడు సుజనా ఈ విషయంలో అజ్ఞాతంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది..  అందుకే ఆయన ఎక్కడా కనిపించడం లేదని, పైగా నోరెత్తడం లేదనే అనుమానాలు ప్రస్తుతం వ్యక్తం అవుతున్నాయి... 

మరింత సమాచారం తెలుసుకోండి: