విశాఖ జిల్లాకు చెందిన  మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు గట్టి షాక్ తగిలింది. ఆయన పోయిన ఏడాది జరిగిన ఎన్నికల్లో విశాఖ ఉత్తరం నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు టీడీపీని వీడి వైసీపీలో చేరిపోయారు. దాంతో కేవలం  నుంచి అతి తక్కువ ఓట్ల తేడాతో  ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన తరువాత ఆయన టీడీపీకి బాగా  దూరం పాటిస్తున్నారు. పార్టీలో ఉంటే ఉన్నట్లు అన్నట్లుగా గంటా వైఖరి ఉంది.

 

ఇదిలా ఉండగా గంటా నియోజకవర్గం అయిన ఉత్తరం నుంచి పెద్ద సంఖ్యలో  కార్యకర్తలు టీడీపీని వీడి వైసీపీలో చేరిపోయారు. దాంతో కేవలం మూడు వేల ఓట్ల తేడాతో గెలిచిన గంటాకు ఇపుడు లోకల్ బాడీ ఎన్నికలు ఇబ్బందేనని అంటున్నారు. గంటా గెలిచిన తరువాత పెద్దగా నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన క్యాడర్ అధికార పార్టీ వైపుగా జంప్ చేశారని అంటున్నారు.

 

గంటాకు యాంటీగా పోటీ చేసిన వైసీపీ అభ్యర్ధి కేకే రాజు సమక్షంలో వందలాది మంది టీడీపీ కార్యకర్తలు పార్టీ తీర్ధం తీసుకున్నారు. దీంతో రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీ గెలిచేందుకు ఇది ఉపయోగప‌డుతుందని ఆ పార్టీ నాయకులు హ్యాపీగా ఉన్నారు తాజా పరిణామంతో గంటా శిబిరంలో కలవరం చెలరేగిందని అంటున్నారు. చూడాలి మరి.

 

దీని కొద్ది రోజుల ముందు గంటా బీజేపీ నుంచి కొంతమంది నాయకులు తమ పార్టీలో చేరుతున్నట్లుగా చెప్పుకున్నారు. అయితే ఒకరిద్దరు కార్యకర్తలు తప్ప తమ నుంచి ఎవరూ వెళ్ళలేదని  మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు ఆ వెంటనే ఖండించారు.


 అదలా ఉంచితే ఇపుడు మాత్రం పెద్ద ఎత్తున  తమ్ముళ్ళు జంప్ చేసారని వినిపిస్తోంది. ఈ పరిణామం బట్టి చూస్తూంటే గంటా నాయకత్వంలో ఉత్తరం  టీడీపీ తూర్పు తిరిగి దండం పెట్టాల్సిందేనా అన్న సెటైర్లు పడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: