అదేంటి చంద్రబాబు ఏంటి.. కుర్రకుంకలు ఆ జగన్, పవన్ లను ఫాలో అవ్వడం ఏంటీ అంటారా.. తప్పదు రాజకీయాల్లోనే కాదు..ఎక్కడైనా సరే.. ఎవరి నుంచైనా సరే కొన్ని విషయాలు నేర్చుకోవాల్సిందే. ఇంతకీ జగన్, పవన్ నుంచి చంద్రబాబు నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటారా... అదే తెలంగాణ రాజకీయాలు వదిలేయడం.. అవును.

 

 

ఎందుకంటే.. ఇంకా చంద్రబాబుకు తెలంగాణలోనూ తెలుగుదేశం జండా రెప రెప ఎగరాలని ఉంది. అందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇటీవల ఆ పార్టీ తెలంగాణ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. పార్టీని ఎలా జనంలోకి తీసుకెళ్లాలో తెలంగాణ నేతలు ఉద్బోధ చేశారట. ఆయన చెప్పిన సూత్రాలేంటో తెలుసా... తెలంగాణలో తెలుగుదేశం నాయకులు ప్రజల్లోకి నాయకులు వెళ్లాలట, మనస్పర్థలు వీడాలట, వారానికి రెండుసార్లు కోర్ కమిటీ భేటీలు నిర్వహించాలట.. ఇలా చెప్పుకొచ్చారు.

 

 

ఇక్కడే ఓ అనుమానం వస్తోంది. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ తెలంగాణలో అసలు తెలుగుదేశం అంటూ పార్టీ ఎక్కడుంది..? అంటే ఇటీవల జరిగిన రకరకాల ఎన్నికల్లో అది ఏమేరకు ఫలితాలు సాధించింది. కనీసం బీజేపీ స్థాయిలో కూడా పార్టీ లేదు కదా.. మరి ఇంకా ఎందుకీ తాపత్రయం అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏదో మళ్లీ గ్రేటర్ ఎన్నికలొస్తున్నాయి కదా అని పాపం చంద్రబాబు ఆశపడుతున్నట్టు కనిపిస్తోంది.

 

 

ఎలాగూ గ్రేటర్‌లో సెటిలర్స్ ఎక్కువ కాబట్టి మళ్లీ ఓ ప్రయత్నం చేయాలన్నది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది. కానీ.. ఇక చంద్రబాబు తెలంగాణను వదిలేసి... పూర్తి స్థాయిలో ఏపీ రాజకీయాలపై దృష్టి పెడితే బెటర్ అన్న సూచనలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు దోస్త్ పవన్ కల్యాణ్‌ జనసేనను తెలంగాణలో మడతపెట్టేశాడు. అటు జగన్ కూడా అదే పని చేశాడు. కానీ పాపం.. ఇంకా చంద్రబాబుకు తెలంగాణపై ఆశ చావలేదేమో అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతే కాదు.. ఏపీ మండలి కాస్తా రద్దయితే లోకేష్ బాబు ను గ్రేటర్ ఎన్నికల్లో పోటీకి నిలబడితే బెటరేమో అన్న సైటైర్లు పడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: