అవును మరి అక్కడ ఉన్నది జగన్. మాటంటే మాటే. ఆయన ఎంత చెబితే అంత. ఎంత‌ దగ్గర తీసుకుంటాడో అంతలా దూరానికి జగన్  పెట్టగలడు. దాంతో ఏడాది కూడా దాటకుండానే జగన్ మంత్రుల్లో యమ టెన్షన్ మొదలైందంట. మా పీకల మీదకు వచ్చాయి ఈ లోకల్ బాడీ ఎన్నికలు అనుకుంటున్నారుట. ఇంతకీ ఏంటా కధా కమామీషు అంటే.

 

జగన్ మంత్రులకు సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చారు. అచ్చ తెలుగులోనే విషయం చెప్పేశారు. తొంబై శాతం పైగా లోకల్ బాడీస్ వైసీపీ పరం కావాలి. అందుకోసం ఏం చేస్తారో నాకు తెలియదు అలా రాని జిల్లా మంత్రులు రాజీనామా  చేయాల్సిందే.

 

ఒకవేళ వారేమైనా మొహమాటపడితే నేనే దగ్గరుండి మరీ కారులో ఎక్కించుకుని గవర్నర్ వద్దకు తీసుకుపోతా, రాజీనామా లేఖ ఇప్పించేస్తా. ఇంత చక్కగా జగన్ చెప్పాకా మినిస్టర్లకు నిద్ర ఉంటుందా. మూడవ‌వారంలో ఎన్నికలు విడతల వారీగా మొదలై మార్చి 31న ఫలితాలు వస్తాయని అంటున్నారు. అంటే కచ్చితంగా పాతిక రోజులు కూడా లేదు

 

మంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా అన్నది పెద్ద డౌట్ గా ఉంది. నిజానికి రెండున్నరేళ్ళ వరకూ మంత్రి పదవి అంటేనే బేజారెత్తిన మంత్రులు ఇపుడు గట్టిగా ఏడాది కూడా తిరగకుండానే కుర్చీ పోతుందంటే బావురుమనరూ. మూడు రాజధానుల కధతో మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా కోస్తా జిల్లాల మంత్రులు బెదురుతున్నారట. మరి వారి జాతకాలను లోకల్ బాడీ ఎన్నికలు తేల్చేసేలా ఉన్నాయి సుమీ అని మిగిలిన వారు జాలిపడుతున్నారట.

 

ఈ పరిస్థితిని చూసి ఎమ్మెల్యేలు, మిగిలిన నాయకులు ధీమాగా ఉన్నారట. వారే మనలను కూడా గెలిపిస్తారు. ఎందుకంటే ముందు పోయేది వారి ఉద్యోగమే కాబట్టి అనుకుంటున్నారుట. జగన్ పెట్టిన ఈ షరతు పార్టీలో కూడా మంత్రులను ఫూల్స్ చేసేలా ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: