ఆ మద్య దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఒక ముస్లిం ఆధ్యాత్మిక కార్యక్రమం దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్యను పెంచేసింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా రావడం, వారంతా దేశవ్యాప్తంగా తమ ప్రాంతాలకు తిరిగి వెళ్లాక, వారితో దగ్గరగా మసిలిన వారికి కరోనా రావడంతో అకస్మాత్తుగా కేసులు, మరణాల సంఖ్య పెరిగింది.  తబ్లీగీ జమాత్ కార్యకర్తలతో సంబంధమున్న 9వేల మందిని ని గుర్తించి క్వారంటైన్ కు పంపినట్లు కేంద్రం ప్రకటించింది.  అయితే ఇందులో 1,306 మంది విదేశీయులు కాగా మిగతా వారంతా భారతీయులే అంటున్నారు.

 

తెలుగు రాష్ట్రాల నుంచి 1500-2000 మంది సుమారు హాజరై ఉంటారని అంచనా. విదేశీయులతో కలిసి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించకుండా ఉండాల్సిందని, ఇప్పుడు ఆ కార్యక్రమం వల్ల దేశ ప్రజలు అనేకమంది కోవిడ్-19 బారిన పడి ప్రాణాలతో పోరాడుతున్నారని అఘా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కరోనా బాధితులుగా ఈ సంఖ్య ఇంతటితో ఆగదని.. వారితో సంబంధమున్న వారి కోసం అన్వేషణ కొనసాగుతుందని పేర్కొంది కేంద్రం.  గురువారం పాజిటీవ్ గా తేలిపన 400 మందిలో నిజాముద్దీన్ నుంచి వచ్చిన వారేనని వెల్లడించింది.

 

 ఇక తమిళనాడు లో నిన్న కరోనా సోకిన 173 మందిలో అత్యధికులు వీళ్లే కావడం శోచనీయం.  ఏపీ నుంచి 369 మంది, తెలంగాణ నుంచి దాదాపు 1030 మంది ఉన్నట్టు ఇప్పటి వరకూ అంచనా వేస్తున్నారు. వీరిలో అత్యధికంగా 600 పైగా హైదరాబాద్ నుంచే ఉండగా, నిజామాబాద్ నుంచి 80 మంది వరకూ ఉన్నట్టుగా మిగిలిన వారంతా 30 జిల్లాల నుంచీ ఉన్నట్టు తెలుస్తోంది.

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: