మహమ్మారి కరోనా వైరస్ వల్ల న్యాయస్థానాలు కూడా మొన్నటిదాకా మోత పడిపోయాయి. వైరస్ ప్రభావం దేశంలో ఎక్కువగా ఉండటంతో కేంద్రం పటిష్టంగా లాక్ డౌన్ అమలు చేయటంతో న్యాయ  స్థానాలు చాలావరకు క్లోజ్ అయిపోయాయి. అత్యవసర కేసుల విషయంలో మాత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలు చేపట్టాయి. అయితే ఉన్న కొద్దీ కేసులు విచారణ వెనకబడి పోతున తరుణంలో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకునే టైమ్ ఆసన్నమైనది. వైరస్ ప్రభావం ఉన్నాగాని ఎన్నాళ్ళని దాక్కుంటా మని కేసులను విచారించడానికి రెడీ అయినది. సుప్రీంకోర్టు మరియు రాష్ట్ర  హైకోర్టు లు త్వరలోనే పెండింగ్ లో ఉన్న కేసులను పూర్తిచేయాలని డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

 

ఇప్పటికే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వీలైనంత వరకు త్వరగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని న్యాయస్థానాలు ఆధునిక సౌకర్యాలు సమకూర్చుకుని వీడియో కాన్ఫరెన్స్ పద్ధతి ద్వారా కేసులకు పరిష్కారానికి పని ప్రారంభించాలని సూచించినట్లు సమాచారం. ఇదే సమయంలో  నల్లకోటు ల స్థానంలో వైరస్ నుంచి రక్షణకు ప్రత్యేక డ్రెస్ కోడ్ ను తీసుకురావాలని నిర్ణయించారు. అలాగే గత రెండు నెలల కీలక సమయం వృధాగా అయిన నేపథ్యంలో వేసవి సెలవులను కుదించుకుని కోర్టు లను మొదలు పెట్టాలని కమిటీ పేర్కొంది.

 

దేశ జనాభా పరంగా చూసుకుంటే కేసుల సంఖ్య ఉన్న కొద్దీ పెరుగుతున్న తరుణంలో పాటు న్యాయస్థానాలు సిబ్బంది కూడా తక్కువగా అంతంతమాత్రంగా ఉండటంతో సుప్రీంకోర్టు పెండింగ్ లో ఉన్న కేసులను త్వరగా తేల్చేయాలని కిందిస్థాయి న్యాయస్థానాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో దిగువస్థాయి న్యాయస్థానాలు అత్యాధునిక న్యాయ వ్యవస్థకు శ్రీకారం చుట్టడానికి కంప్యూటర్లు మరియు సర్వర్లు అదేవిధంగా ఇంటర్నెట్ హైస్పీడ్ వంటివాటిని ఏర్పాటు చేసుకోవటానికి రెడీ అవుతున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు న్యాయస్థానంలో సిబ్బందికి ఇటువంటి విషయాలలో శిక్షణ తీసుకుని విధుల్లో చేరాలని టైం పట్టే అవకాశం ఉందని మరికొంతమంది న్యాయ నిపుణులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: