ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు చాలా బలంగా ఉన్నారు. ఆయనను ఎదుర్కోవటం అనేది చాలా వరకు కష్టమే. అయితే తెలుగుదేశం పార్టీ అధిష్టానం మాత్రం సీఎం జగన్ ని టార్గెట్ చేసి ముందుకు వెళుతుంది. తెలుగుదేశం పార్టీ నేతలు సీఎం జగన్ అవినీతి కార్యక్రమాలపై ఎక్కువగా ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా ఆయన జైలుకు వెళ్లే అవకాశం ఉంది అని ఆరోపణలు కూడా తెలుగుదేశం పార్టీ నేతలు పదేపదే చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన జైలుకు వెళ్లడం ఏమో గానీ తెలుగుదేశం పార్టీ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ప్రతిసారి కూడా సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును కూడా వాళ్ళే చెప్పేస్తున్నారు.

అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యూహం మార్చే అవకాశాలు కనబడుతున్నాయి. కొంత మంది ఎమ్మెల్యేలను మానసికంగా దెబ్బ కొట్టాలని చంద్రబాబునాయుడు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఆయనకు వెనక నుంచి కొంతమంది సహకారం ఎక్కువగా ఉంది. దీనితో చంద్రబాబు నాయుడు ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేల మీద ఎక్కువ ఫోకస్ చేసినట్లుగా సమాచారం. అధికార పార్టీ ఎమ్మెల్యేలను మానసికంగా దెబ్బ కొట్టి వారు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. అంతేకాకుండా బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉన్న వారిని కూడా ఇటు చంద్రబాబు నాయుడు గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

వారిని కూడా మానసికంగా టార్గెట్ చేయడానికి తన టీంని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇవి ఎంతవరకు ఫలిస్తాయి ఏంటి అనేది చూడాలంటే కొంత కాలం ఆగాల్సిందే. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వాతావరణం ఇప్పట్లో కనపడటం లేదు. మరి చంద్రబాబు నాయుడు ఈ వ్యూహం ద్వారా ఏం సాధిస్తారు ఏంటి అనేది చూడాలి. ఇప్పటికే కొంత మంది మంత్రులను చంద్రబాబునాయుడు ఆయన టీం టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: