2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కువ శాతం హైదరాబాద్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. కరోనా రాకముందు వారంలో కొన్నిరోజులు ఏపీలో ఉండి, వారాంతంలో హైదరాబాద్‌కు వెళ్ళేవారు. ఇక కరోనా ఎంటర్ అయ్యాక బాబు హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. అటు నారా లోకేష్ సైతం తండ్రితో పాటే హైదరాబాద్‌లోనే ఉన్నారు. దీంతో ఏపీలో పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఓ వైపు అధికార పార్టీ రోజురోజుకూ బలపడుతుంటే, టీడీపీ వీక్ అవుతూ వచ్చింది.

ఇటు టీడీపీ కార్యకర్తలు సైతం అధినేత హైదరాబాద్‌కే పరిమితం కావడం పట్ల అసంతృప్తిలో ఉండిపోయారు. అలాగే లోకేష్ కూడా అక్కడే ఉండిపోవడం టీడీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు. దీంతో చంద్రబాబు సడన్‌గా పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులని నియమించారు. అలాగే పార్టీని ప్రక్షాళన చేసి, కీలక పదవులు భర్తీ చేశారు. అలాగే చినబాబుని ఫీల్డ్‌లోకి దింపారు.

ఏపీలో వరదల వల్ల పంటలు తీవ్రంగా నష్టపోవడంతో, లోకేష్ పరామర్శ యాత్ర మొదలుపెట్టారు. రోజుకో జిల్లాలో పర్యటిస్తూ, రైతులకు ధైర్యం చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. మునిగిపోయిన పంట పొలాల్లోకి దిగేసి, ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అయితే ఇలా చేయడం వల్ల జనంలో చినబాబు పట్ల ఏమన్నా అనుకూలత వచ్చిందా? అంటే కొంచెం అవుననే సమాధానం వినిపిస్తోంది. అలా చినబాబు డైరక్ట్ ఫీల్డ్‌లోకి దిగడం వల్ల టీడీపీ కేడర్‌లో నూతన ఉత్సాహం వచ్చింది.

అధికార వైసీపీకి ధీటుగా నిలబడటానికి కాస్త ధైర్యం వచ్చింది. అదే సమయంలో సాధారణ జనంలో సైతం లోకేష్ పట్ల సానుభూతి పెరిగిందనే అంటున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం సైతం రైతులని ఆదుకునే దిశగా ముందుకెళుతుంది. దీని వల్ల లోకేష్‌కు రైతుల నుంచి సానుకూలత ఏమి రాలేదు. దానికి తోడు సొంత పార్టీకి చెందిన రైతుల పొలాల్లోనే తిరిగారనే టాక్ ఉంది. దీని వల్ల లోకేష్ యాత్రకు మిక్సడ్ రిజల్ట్స్ వస్తున్నాయనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: