బీజేపీలోకి విజయశాంతి వెళ్లడంతో ఆమె వెంట ఎవరు వెళ్తారు ఏంటి అనే దానిపై అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు విజయశాంతికి సంబంధించి రాజకీయంగా ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఆమెకు కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత లేదని కొంతమంది అంటుంటే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని ఆమె భావించి బయటకు వెళ్తున్నారు అని మరికొంతమంది అంటున్నారు. అయితే ఇప్పుడు ఆమె బిజెపిలో కి వెళ్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు బయటకు వెళ్తారు ఏంటి అనే దానిపై అందరూ కూడా ఆసక్తిగా ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది కీలక నేతలు బయటకు వెళ్లడానికి రెడీగా ఉన్నారని ఈ నేపథ్యంలోనే విజయశాంతితో పాటు వారు కూడా పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. ప్రధానంగా వరంగల్ మెదక్ జిల్లాలకు చెందిన కొంతమంది కాంగ్రెస్ నేతలు ఇప్పుడు బయటికి వెళ్లడానికి చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఇప్పటికే వారందరితో కూడా విజయ శాంతి చర్చలు జరిపారని వారి పార్టీ మారడానికి రెడీగా ఉన్నారని అంటున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఒక క్లారిటీ రానుంది. ఇక విజయశాంతి రేపు బీజేపీలో చేరే అవకాశాలు కనబడుతున్నాయి.

మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా విజయశాంతితో చర్చలు జరిపారని వారు కూడా బయటకు రావడానికి రెడీగా ఉన్నారని సమాచారం. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా ముగ్గురు నేతలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు అంజన్కుమార్ యాదవ్ ఇప్పుడు పార్టీకి రాజీనామా చేయడానికి రెడీ అవుతున్నారని సమాచారం. దీంతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కాస్త ఆసక్తి పెరిగిపోయింది. మరి భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు మాత్రం కాస్త హాట్ టాపిక్ గానే ఉన్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: