ఏపీలో టీడీపీ నేతలు సిఎం వైఎస్ జగన్ ని పదే పదే టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా అధికారులను లక్ష్యంగా చేసుకుని టీడీపీ నేతలు విమర్శలు చేయడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. అనవసర అంశాలను ప్రస్తావిస్తూ ఎక్కువగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. అధికారులకు రాజకీయాలను ఆపాదిస్తూ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ప్రతీ అంశంలో కూడా అధికారుల తప్పులను ప్రస్తావిస్తూ విమర్శలు చేయడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక సిఎం జగన్ కి ముడిపెట్టి అధికారుల తప్పులను విమర్శిస్తున్నారు.

తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నానీ తీవ్ర విమర్శలు చేసారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాఫియా రాజ్యం నడుస్తుంది అని మండిపడ్డారు. ప్రజలెవ్వరు ఇంట్లో నుంచి బయటకు రాకుండా భయపెడుతున్నారు అని ఆయన విమర్శించారు. ప్రతిపక్షాల నోరు నొక్కుతున్నారు అన్నారు. అవినీతి అక్రమాలకు ఎవరైనా ప్రశ్నిస్తే వారిని అరెస్ట్ లు చేస్తున్నారు అని మండిపడ్డారు. కొంతమంది పోలీసులు కూడా ప్రభుత్వానికి తొత్తులుగా పని చేస్తున్నారు అని విమర్శించారు. ఐపియస్ లు చట్టానికి లోబడి పని‌ చేయాలే తప్ప.. ప్రభుత్వానికి అనుకూలంగా చేయకూడదు అని ఆయన హెచ్చరించారు.

అధికార పక్ష నాయకుల వ్యాఖ్యలు మీకు కనిపించవా అని కేశినేని నానీ నిలదీశారు. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు పై అక్రమంగా కేసులు పెడుతున్నారు అని కేశినేని నానీ మండిపడ్డారు. అబ్దుల్ సలాం ఉదంతం అందరనీ కలచి‌వేసింది అని అన్నారు. వారికి న్యాయం చేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని విమర్శించారు. ఈ రోజు అబ్దుల్ సలాం కి న్యాయం చేద్దాం అని చూస్తే అందరిని హౌస్ అరెస్ట్ చేశారు అని ఆయన మండిపడ్డారు. తెలుగు దేశం పార్టీ అందరికి అండగా ఉంటుంది అని స్పష్టం చేసారు. సలాం  కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతుంది అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: