ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. దాదాపు 30 పోలింగ్ కేంద్రాలలో 166 టేబుల్ ను ఎన్నికల సంఘం ఏర్పాటు చేయగా ప్రస్తుతం సిబ్బంది శరవేగంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతున్నారు. ఈ  క్రమంలోనే డివిజన్ల వారీగా ప్రస్తుతం ఫలితాలను కూడా వెల్లడిస్తున్నారు అధికారులు. అయితే మొదట పోస్ట్ బ్యాలెట్ పత్రాలను చెక్ చేసిన సమయంలో 72 స్థానాల్లో బిజెపి ఆధిక్యంలో కొనసాగుతుండగా  కేవలం 32 స్థానాల్లో టీఆర్ఎస్ కొనసాగుతూ వచ్చింది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ ఎన్నిక లో కూడా టిఆర్ఎస్ పార్టీ కి భారీ షాక్ తగులుతుంది అని అందరూ అనుకున్నారు.



 కానీ బ్యాలెట్  పత్రాలు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాగానే టిఆర్ఎస్ పార్టీ పుంజుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక భారీగా మెజారిటీ సాధించే దిశగా ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది  దాదాపు నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే రెండు డివిజన్లలో విజయఢంకా మోగించింది మరోవైపు ఎంఐఎం పార్టీ 24 స్థానాలకు ఆధిక్యంలో ఉండగా రెండు డివిజన్లలో గెలుపొంది ఇక మూడవ స్థానంలో బిజెపి 22 స్థానాల్లో ముందంజలో ఉంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన ఓట్ల కౌంటింగ్ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో ఎక్కడ చూసినా హాట్ హాట్  వాతావరణం నెలకొని ఉంది అన్న విషయం తెలిసిందే.




 ఈ క్రమంలోనే పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటు చేసుకుంటున్నాయి. జాంబాగ్ డివిజన్ ఓట్లపై బిజెపి అభ్యంతరం తెలిపింది. ఓ బూతులో  471 ఓట్లు పడ్డాయని ముందుగా ఎన్నికల సంఘం తెలిపిందని కానీ ప్రస్తుతం కేవలం 257 ఓట్లు మాత్రమే ఉన్నాయి అంటూ ఎన్నికల సంఘం చెప్పడం విడ్డూరంగా ఉంది అంటూ బీజేపీ ఆరోపించింది. కావాలని ఎన్నికల సంఘం ఓట్లను గల్లంతు చేసింది అంటూ ఆరోపించింది బిజెపి. అయితే తాము  పోలింగ్ శాతాన్ని తప్పుగా చెప్పాము  అంటూ ఎన్నికల అధికారులు వివరణ ఇచ్చారు. అంతేకాకుండా కూకట్పల్లి డివిజన్ లో కూడా ఓట్లు గల్లంతు అయ్యాయి  అంటూ అటు బీజేపీ నేతలు ఆందోళనకు దిగడంతో అక్కడ పోలీసులు వారిని అడ్డుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: