గ్రేటర్ ఎన్నికల ఫలితాలు బీజేపీ లో ఎన్నడు లేని ఉత్సాహం తెచ్చిందని చెప్పొచు..  తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ రోజుకోరకం వ్యాఖ్యలు చేస్తు బీజేపీ లో కొత్త ఉత్సాహాన్ని నెలకొల్పుతున్నారు. . కేసీఆర్ అవినీతి చిట్టా మొత్తం తమ వద్ద ఉందని.. జైలుకు పంపుతామని అదే పనిగా అయన విమర్శించారు.. త్వరలో ప్రభుత్వం కూడా కూలిపోతుందని, అవినీతి ఆధారాలతో త్వరలో కోర్టుకు ఎక్కుతామని చెప్పగా ఇప్పుడు రెండేళ్ళు ఉద్యమాలు చేస్తామని ప్రకటించడం చూస్తుంటే కేవలం భయపెట్టడానికే బీజేపీ నేతలు అలా విమర్శలు చేశారని స్పష్టంగా తెలుస్తుంది.

తెలంగాణా రాష్ట్రంలో అనూహ్యంగా బలపడిన బీజేపీ పార్టీ భవిష్యత్ లో మరింత బలపడడానికి ప్రణాళికలు వేసుకుంది. వచ్చే రెండేళ్ళ పాటు ప్రజలకు జరిగే అన్యాయాల విషయంలో ఉద్యమాలు చేయాలనీ నిర్ణయించుకుంది. తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్ ఈమేరకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అయన చేసిన ఈ వ్యాఖ్యలతో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పొచు.. కేంద్రానికి బేషరతుగా కేసీఆర్ మద్దతు పలుకుతున్నందున.. గతంలోలా… ఆయనపై విమర్శల దాడి చేయలేమన్న అభిప్రాయానికి బీజేపీ నేతలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయన కేంద్రానికి సపోర్ట్ చేస్తూంటే బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారని ప్రజలు అనుకునే అవకాశం ఉందని.. అయితే అదే సమయంలో టీఆర్ఎస్‌తో ఎలాంటి పొత్తులు… ఉండవనే సంకేతాన్ని ప్రజల్లోకి పంపేలా కార్యాచరణ ఉండాలని అనుకున్నట్లుగా చెబుతున్నారు.

కేసీఆర్ గతంలోలా బీజేపీ పై యుద్ధం చేస్తూ ఉంటే బీజేపీ నేతలకు తెరాస ని విమర్శించేందుకు అస్త్రం దొరికి ఉండేది కానీ ఇప్పుడు అలా కాదు, కేంద్రం చర్యలన్నింటికి కేసీఆర్ మద్దతు పలుకుతున్నాడు. బీజేపీని పల్లెత్తు మాట అనవద్దని క్యాడర్‌కు సంకేతాలు పంపారు. కేటీఆర్ కూడా కలసి పని చేద్దామని బహిరంగంగానే పిలుపునిచ్చారు. దీంతో ఏం చేయాలో తెలియక బీజేపీ నేతలు అయోమయంలో పడ్డారు. గ్రేటర్ ఎన్నికల్లో ఉన్న వేడి ని ఇప్పుడు బీజేపీ నేతలు ప్రదర్శించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఇప్పుడు ఏం చేసిన కేవలం అది తెరాస ని భయపెట్టేందుకే మాత్రమే చేస్తుందని అనుకోవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..

మరింత సమాచారం తెలుసుకోండి: