ఈ మాట ఇప్పుడే కాదు.. గ‌త కొన్నేళ్లుగా ఏపీ రాజ‌కీయాల్లో వినిపిస్తూనే ఉంది. అసెంబ్లీలో బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుల గ‌ళం వినిపించేదెప్పుడని బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గం ప్ర‌శ్నిస్తూనే ఉంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఏ పార్టీ కూడా ఆశించిన మేర‌కు బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గాన్ని రాజ‌కీయంగా ప్రోత్స‌హించ‌డం కానీ, వారికి టికెట్లు ఇవ్వ‌డం కానీ.. చేసింది లేదు. మ‌రీ ముఖ్యంగా కాంగ్రెస్‌లో కొంత మెరుగైన ప‌రిస్థితి గ‌తంలో క‌నిపించినా.. టీడీపీలో ఈ త‌ర‌హా ప‌రిస్థితి ఎప్పుడూ కనిపించ‌లేదు. ఎప్పుడైనా అడ‌పా ద‌డ‌పా ఇచ్చినా.. వారు ప్ర‌ముఖంగా గుర్తింపు పొందింది లేదు.

ఇక‌, కాంగ్రెస్ హ‌యాంలో విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మ‌ల్లాది విష్ణు, విశాఖ‌లో ద్రోణంరాజు స‌త్య‌నారాయ‌ణ‌ టికెట్లు సంపాయించుకున్నారు. మంథ‌ని నుంచి నాడు దుద్దిళ్ల శ్రీథ‌ర్ బాబు గెలిచి మంత్రి కూడా అయ్యారు. వీరిలో ఒక‌రిద్ద‌రు దూకుడుగా ఉన్నా.. వారికి పెద్ద‌గా గుర్తింపు ల‌భించ‌లేదు. ఇక‌, ప్ర‌స్తుతం వైసీపీ హ‌యాంలో గ‌త 2019 ఎన్నిక‌ల్లో న‌లుగురికి ఆయ‌న టికెట్లు ఇచ్చారు. విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌, గుంటూరు జిల్లా బాప‌ట్ల‌, విశాఖ తూర్పు నుంచి విజ‌య‌నిర్మ‌ల‌, అదేవిధంగా ద్రోణంరాజు స‌త్య‌నారాయ‌ణ కుమారుడు శ్రీనివాస‌రావుకు అవ‌కాశం క‌ల్పించారు.

వీరిలో విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నుంచి మ‌ల్లాది విష్ణు కేవ‌లం 25 ఓట్ల మెజారిటీతో విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, బాప‌ట్ల నుంచి కోన ర‌ఘుప‌తి.. గెలుపు గుర్రం ఎక్కారు. అయితే. మిగిలిన ఇద్ద‌రూకూడా ఎన్నిక‌ల పోరులో గెలుపు గుర్రం ఎక్క‌లేక పోయారు. ఇక‌, టీడీపీ త‌ర‌పున టికెట్ ఎవ‌రికీ ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో వైసీపీ త‌ర‌ఫున గెలిచిన ఇద్ద‌రే బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గం మొత్తానికి ప్రాతినిధ్యం వ‌హించాల్సి వ‌చ్చింది. అయితే.. ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే. కోన ర‌ఘుప‌తిని డిప్యూటీ స్పీక‌ర్ చేశారు. దీంతో ఆయ‌న స‌భా కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌కే ప‌రిమితం అయ్యారు.

ఫ‌లితంగా అసెంబ్లీలో బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గం గ‌ళం వినిపించేందుకు మ‌ల్లాది విష్ణు ఒక్క‌రే మిగిలారు. పోనీ.. ఈయ‌నైనా.. బ్రాహ్మ‌ణ స‌మ‌స్య‌లు వినిపిస్తున్నారా? అంటే.. కేవ‌లం పార్టీ అధినేత జ‌గ‌న్‌ను కొనియాడ‌డానికే స‌మ‌యం స‌రిపోవ‌డం లేద‌ని అంటున్నారు. దీంతో తాము మ‌ల్లాదిని గెలిపించినా.. ఏం ప్ర‌యోజ‌నం అంటున్నారు సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం బ్రాహ్మ‌ణులు.

బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి
తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి. మీ హ‌క్కులు తెలుసుకోండి..! ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌పడుతున్నారే త‌ప్ప‌... మీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఏ రాజ‌కీయ పార్టీ కూడా ముందుకు రావ‌డం లేద‌నే విష‌యాన్ని గుర్తించండి. ప్ర‌భుత్వాలు మారినా.. మీ స‌మ‌స్య‌లు మాత్రం తీర‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌స్య‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో వాటిని ప‌రిష్క‌రించేందుకు ఏ ఒక్క‌రూ బాధ్య‌త‌లు తీసుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో మీ గ‌ళాన్ని వినిపించేందుకుhttps://www.indiaherald.com/ ముందుకు వ‌చ్చింది. బ్రాహ్మ‌ణుల స‌మ‌స్య‌లను ప్ర‌భుత్వానికి చేర‌వేసేందుకు https://www.indiaherald.com/ ప్ర‌య‌త్నిస్తోంది. దీనిలో మీ భాగ‌స్వామ్య‌మే కీల‌కం. మీ స‌మ‌స్య ఏదైనా.. ప్ర‌భుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేం ముందుంటాం.


మీరు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959 కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..!

మరింత సమాచారం తెలుసుకోండి: