తెలంగాణ రాజకీయాల్లో కొద్దిరోజులుగా కేటీఆర్ చర్చనీయాంశంగా మారారు. ఫిబ్రవరి 18 వ తారీఖున కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని కొద్దిరోజులుగా విపరీతమైన ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయానికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. కొందరు మంత్రులు సైతం కేటీఆర్ అన్నిటికీ అర్హుడని ఆయన ముఖ్యమంత్రి అయితే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు. దీంతో కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అనే ప్రచారం తెలంగాణ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. 

అయితే తాజాగా ఈ అంశానికి సంబంధించి కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావు స్పందించారు. కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ తో ఆయన ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించారు. ఈ క్రమంలో ఒక ఫాలోవర్ ఆయనను మీ నాన్న కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతున్నారట కదా నిజమేనా అని ప్రశ్నించాడు. ఫిబ్రవరి 20 తర్వాత కేటీఆర్ నెక్స్ట్ సీఎం అంటున్నారు నిజమా బ్రో ఇది అని ప్రశ్నించాడు. 

అయితే ఈ విషయం మీద హిమాన్షు రావు ఆసక్తికరంగా స్పందించాడు. మా నాన్న కేటీఆర్ అలాగే మా తాత కేసీఆర్ ఇద్దరూ ఇంట్లో ఉన్నప్పుడు పాలిటిక్స్ గురించి డిస్కస్ చేయరని ఆయన చెప్పుకొచ్చాడు. వాళ్లు కలిసినప్పుడు ఎక్కువగా రిలాక్స్ అవ్వడానికి మాత్రమే చూస్తారు అని చెప్పుకొచ్చాడు. అంటే ఈ ప్రచారం అంతా ఒట్టిదే అని క్లారిటీ ఇచ్చినట్లయింది. కానీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని అంటున్నారు. బండి సంజయ్ అయితే ఆయనకు బాధ్యతలు అప్పజెప్పి అందుకే కేసీఆర్ ఇంట్లో యాగాలు యజ్ఞాలు నిర్వహిస్తున్నారని చెప్పుకొచ్చారు. చూడాలి మరి ఏమవుతుందనేది ?

మరింత సమాచారం తెలుసుకోండి: