ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు ఏపీ పోలీస్ విభాగం అన్ని విధాలుగా సిద్దమవుతుంది. ఎవరికి ఇబ్బంది లేకుండా వ్యవహరించడానికి రెడీ అయింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా అన్ని జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాసేపటి క్రితం ఆ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్  కీలక వ్యాఖ్యలు చేసారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు  సంబంధించి అన్ని అంశాలపై చర్చలు జరిగాయి అని ఆయన అన్నారు.

పంచాయతీ ఎన్నికలకు సంసిద్దత, భద్రతా అంశాలపై చర్చించాం అని అయన వెల్లడించారు. ఎన్నికలతో పాటు పోలీసు సిబ్బందికి వాక్సినేషన్ వేయాల్సి ఉంది అని అన్నారు. ఒకే సమయంలో పోలీసు సిబ్బందికి వాక్సినేషన్ చేయడం సమస్యగా మారింది అని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యకు పరిష్కారం రావాల్సి ఉంది అని అన్నారు. త్వరలో  దొరుకుతుందని ఆశిస్తున్నాం అని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలన్నింటినీ గుర్తించాం  అని డీజీపీ వివరించారు. సాధారణ, సున్నిత ,అతి సున్నిత సమస్యాత్మక ప్రాంతాలను ఎస్పీలు గుర్తించారు అని అన్నారు.

ఎన్నికలు జరిగే అన్ని ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తాం  అని స్పష్టం చేసారు. గుర్తించిన సమస్యలన్నింటినీ ఎస్పీలు పరిష్కరిస్తారు అని ఆయన పేర్కొన్నారు. ఇక ఇదిలా ఉంటే డీజీపీ తీరుపై ఏపీ హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కేసుపై హైకోర్ట్ లో విచారణ జరిగింది. డీజిపి ఎన్నికల వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నారని తొలుత పిటీషన్ దాఖలు చేసారు. మధ్యాహ్నం కు హాజరు కాగలరని పిటీషన్ వేయగా దానికి కోర్ట్ అంగీకరించి మధ్యాహ్నం 2.15 నిముషాలకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. ఇదే కేసులో హై కోర్టుకు హోం సెక్రటరీ విశ్వజిత్, ఐజి లడ్డా హాజరయ్యారు. పదోన్నతి వివాదాన్ని పరిష్కరించామని కోర్టుకు అధికారులు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: