ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఎంతో ఘనంగా విజయం సాధించామని  చెప్పుకున్నా సరే వాస్తవ పరిస్థితులు మాత్రం చాలా భిన్నంగా ఉన్నాయి. 60 నుంచి 65 శాతం వరకు మాత్రమే పార్టీ విజయం సాధించిన విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు తమకు చాలా వరకు కలిసి వస్తాయనే భావనలో వైసీపీ నేతలు చాలా వరకు కూడా ఉన్నారు అనే విషయం చెప్పాలి. అయితే ఇప్పుడు వాస్తవ పరిస్థితులు మాత్రం చాలా వరకు భిన్నంగా ఉన్నాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

చాలా నియోజకవర్గాల్లో రోడ్ల నిర్మాణం అనేది అధికార వైసీపీకి చాలా ఇబ్బందికరంగా మారింది. రోడ్ల దెబ్బకు ప్రజలు వాహనాలు బయటకు తీసుకోలేని పరిస్థితులు ఉన్నాయి అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో దీనిపై ఆరోపణలు చేస్తుంది. కడప జిల్లాలో రోడ్ల నిర్మాణం సక్రమంగా లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఎక్కువగా రోడ్ల నిర్మాణం మీద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టి సారించేవారు.

అప్పటి మంత్రులు కూడా రోడ్ల నిర్మాణాన్ని టార్గెట్గా పెట్టుకుని పనులు చేశారు. కానీ ఇప్పటి మంత్రులు ఎక్కడా రోడ్ల నిర్మాణం మీద ఎక్కడా కూడా దృష్టి పెట్టిన పరిస్థితి కనపడటం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా దారుణంగా ఉన్న నేపథ్యంలో మంత్రులు కూడా రాష్ట్ర ప్రభుత్వంను ఒత్తిడి చేసే ప్రయత్నం చేయటం లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కనీసం ముఖ్యమంత్రి జగన్ సొంత  నియోజకవర్గంలో కూడా రోడ్ల నిర్మాణం అనేది ఆశించిన విధంగా లేదు అనే విషయం స్పష్టంగా చెప్పాలి. కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి జిల్లాల్లో రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది అనే విషయం చెప్పాలి. మరి ఈ రోడ్ల నిర్మాణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంత వరకు దృష్టి సారిస్తారు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: