ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీలో కొంతమంది సీనియర్ నేతలు చంద్రబాబు నాయుడికి పెద్ద తలనొప్పిగా మారినట్లు వార్తలు ఉన్నాయి. కొంతమంది నేతల విషయంలో చంద్రబాబు నాయుడు చాలా వరకు సీరియస్ గా ఉన్నా సరే కొంతమంది నేతలు మాత్రం ఆయనకు సహకరించే విషయంలో ఇబ్బందులు సృష్టిస్తూనే ఉన్నారు. దీనివలన పార్టీ చాలా జిల్లాల్లో నష్టపోతుందనే భావన ఉంది. విశాఖ జిల్లాలో పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. అలాగే విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో కూడా పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా వరకు కూడా పార్టీ మంచి ప్రభావం చూపించినా సీనియర్ నేతల కారణంగా కొంత మంది ముందుకు రాలేకపోతున్నారు. సీనియర్ నేతల కారణంగా కొంతమంది నేతలు ఉద్యమాలు కూడా చేయలేకపోతున్నారు. ప్రజల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉన్నా సరే కొంతమంది నేతలు పార్టీని పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయడం లేదు. ఇక సీనియర్ నేతల మాట విని కొంత మంది యువ నాయకత్వం కూడా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయడం లేదు. దీనిపై చంద్రబాబు నాయుడు సీరియస్ గా  ఉన్నారని ఈ మధ్యకాలంలో వార్తలు వచ్చాయి.

కళా వెంకటరావుని పక్కన పెట్టడం తో ఆయన వర్గం దాదాపుగా ఇప్పుడు ఉత్తరాంధ్రలో సైలెంట్ అయిపోయింది. మొన్నటి వరకు మీడియాతో ఎక్కువగా మాట్లాడిన ఎమ్మెల్యేలు ఇప్పుడు సైలెంట్ గా ఉంటున్నారు. దీంతో అనేక ఇబ్బందులు అధికార పార్టీ నుంచి ఎదుర్కొంటుంది. అధికార పార్టీ నేతలు ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతున్నా సరే కొంతమంది మీడియాతో మాట్లాడే ప్రయత్నాలు కూడా చేయడం లేదు. ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు కూడా పెద్దగా ప్రజల్లోకి రాకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు ధైర్యం లేకుండాపోయింది. ఒకరిద్దరు నేతలు ముందుకు వచ్చినా సరే విశాఖ జిల్లా నుంచి పోటీ చేసిన ఇన్ ఛార్జీలు కూడా మాట్లాడటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: