దేశవ్యాప్తంగా ఇపుడున్న పరిస్థితుల ఆధారంగా చూస్తే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే చెప్పాలి. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషయంలో ప్రజల్లో ఆగ్రహం పెరిగిపోతుంది. ప్రధానమంత్రి పనితీరు విషయంలో ప్రజలకు అనేక అనుమానాలు కూడా ఉన్నాయి. ఆయన సమర్థవంతంగా పరిపాలించడం లేదు అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతుంది. అవసరమైన సమయంలో కూడా ప్రధానమంత్రి బయటకు రాకపోవడం పట్ల చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదేవిధంగా భవిష్యత్తులో కూడా ఉంటే ప్రధానమంత్రి ప్రజల్లో మరింత ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని కొంతమంది హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా వైరస్ పై పోరాటం చేస్తుంటే ప్రధానమంత్రి బయటకు రాకుండా కేవలం ఫోన్లో మాట్లాడుతూ సమయం వృధా చేస్తున్నారని చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు అన్ని దేశాల్లో కూడా ప్రధాన మంత్రులు తీవ్ర స్థాయిలో కష్టపడుతున్న సరే ప్రధానమంత్రి మాత్రం ఇక్కడ కష్టపడే ప్రయత్నం చేయలేకపోతున్నారు. దీని కారణంగా అనేక ఇబ్బందులు వస్తున్నాయి.

రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీని విపక్షాలు అన్నీ కూడా గట్టిగానే టార్గెట్ చేస్తున్నాయి. కాబట్టి ప్రధానమంత్రి కష్టపడాల్సిన అవసరం ఉంది. కానీ ఆయన పరిపాలన విషయంలో ఒక ఆలోచన లేకుండా ముందుకు వెళుతున్నారని కేవలం విపక్షాలను టార్గెట్ చేయడానికి మాత్రమే ఆయన ఆసక్తి చూపిస్తున్నారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో కూడా ప్రధానమంత్రి ఇదే విధంగా ఉంటే ఆయనపై ప్రజల్లో నమ్మకం అనేది పూర్తిగా చచ్చిపోయే అవకాశం ఉంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దేశవ్యాప్తంగా కూడా ప్రధానమంత్రి పనితీరుపై ప్రజల్లో అనేక అనుమానాలు బలపడుతున్నాయి. భవిష్యత్తులో కూడా మోడీ సమర్థవంతంగా వ్యవహరించ లేకపోవచ్చు అనే అభిప్రాయం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ హయాంలో దేశంలో చాలా అభివృద్ధి జరిగిందని మోడీ వచ్చిన తర్వాత దేశం వెనక్కి వెళ్ళిపోయింది అని కొంతమంది కామెంట్లు కూడా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: