సాధారణంగా చాలా మంది మొబైల్ పోగొట్టుకోవడం లేదా.. ఎవరైనా ఫోన్ దొంగిలించడడం అనేది ఊహించకుండా జరిగిపోతుంది. ఇక పోగొట్టుకున్నా వస్తువులు వెంటనే దొరకడం చాలా కష్టం. పోయిన వస్తువు దొరకడానికి కొంత టైం పడుతుంది. కానీ దాన్ని మనం ఎక్కడ ఉందో సులువుగా కనుక్కోవచ్చు. ఇలా చేస్తే ఆ దొంగ ఇట్టే దొరికిపోతాడు. అంతే కాకుండా వాట్సాప్ చాట్ ను కూడా తొలగించవచ్చునని అంటున్నారు నిపుణులు.

అయితే మొదటగా గూగుల్ ఓపెన్ చేసి అందులో  How To Find mobile Location అనేది టైప్ చేయాలి. అందులో మన మొబైల్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు లేదా.. google Find My Device యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని దాని ద్వారా కూడా ఎక్కడ ఉందనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది.

ఇక ఈ మెయిల్ ద్వారా కూడా సులువుగా కనిపెట్టే అవకాశం ఉంటుంది. దీని కోసం మొదట మన ఈ మెయిల్ లాగిన్ కావాల్సి ఉంటుంది. అందులో ఫైండ్ మై డివైస్ ఆప్షన్ ను ఆన్ చెసి.. ఆ మెయిల్ ద్వారా మొబైల్ ఫోన్ ను ఎక్కడ ఉన్నా తెలుసుకోవచ్చు. అంతే కాకుండా మొబైల్ ఎంత దూరంలో ఉందో తెలుసుకోవచ్చు. మొబైల్ ను రింగ్ కూడా చేసే అవకాశం ఉంటుంది.

అంతే కాకుండా.. మన వాట్సాప్ లోని సున్నితమైన సమాచారాన్ని దుర్వినియోగం కాకుండా చూడొచ్చు. దీని కోసం నెట్‌వర్క్ సర్వీస్ ప్రొవైడర్‌కు కాల్ చేసి, మీ వాట్సాప్ ఖాతాను ఎవరూ యాక్సెస్ చేయలేని విధంగా మీ సిమ్ కార్డును లాక్ చేయాల్సి ఉంటుంది. వాట్సాప్ ఖాతాను అసలే డీ యాక్టివేట్ చేయాలంటే కంపెనీ కి మెయిల్ చేస్తే సరిపోతుంది. మెయిల్‌లో ప్రధానంగా "Lost/Stolen: Please Deactivate My Account అని ఇచ్చి మొబైల్ నంబర్ ను ఇంటర్నేషనల్ ఫార్మాట్‌లో ఇస్తే సరిపోతుంది. వేరే ఫోన్ తీసుకున్నప్పడు 30 రోజుల్లోగా ఖాతాను యాక్టివ్ చేయాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: