రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. రెండు ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య ఉప్పు నిప్పుగా వ్య‌వ‌హారం ముదురుతోంది. అధికా ర వైసీపీ , ప్ర‌తిప‌క్షం టీడీపీలు క‌త్తులు నూరుతున్నాయి. నువ్వా-నేనా అనే రేంజ్‌లో రాజ‌కీయ యుద్ధానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. నిజానికి ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు లేక పోయినా.. ఈ రెండు పార్టీల మ‌ధ్య ఎన్నిక‌ల‌కుముందున్న వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ఒక‌రిపై ఒక‌రు పైచేయిసాధించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఒక‌రిపై ఒక‌రు వివాదాలు చేసుకుంటున్నారు. వ్యాఖ్య‌లు చేసుకుంటున్నారు. స‌వాళ్లు రువ్వుకుంటున్నారు. దీనిలో అటు వైసీపీని, ఇటు టీడీపీని దేనినీ త‌క్కువ చేసి చూసే ఛాన్స్ క‌నిపించ‌డం లేదు. రెండు పార్టీలూ.. దూకుడుగానే ఉన్నాయి.

ప‌ర్య‌వ‌సానంగా.. రాష్ట్ర ప్ర‌జ‌లు బిక్కుబిక్కుమంటున్నారు. మ‌రి ఈ యుద్ధం ఎవ‌రు ఆపుతారు?  ఎక్క‌డ ముడిప‌డుతుంది?  రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు ఎప్పుడు ఏర్ప‌డ‌తాయి? అనేది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. గ‌తంలో త‌మిళ‌నాడు, కేర‌ళ వంటి ద‌క్షిణాది రాష్ట్రాల్లోనూ ఇలానే ప్ర‌తిప‌క్ష, అధికార ప‌క్ష‌పార్టీల మ‌ధ్య వివాదాలు రేగిన‌ప్పుడు.. కాంగ్రెస్‌, క‌మ్యూనిస్టు పెద్ద‌లు కూర్చుని మాట్లాడుకున్న సంద‌ర్భాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే బీజేపీ పెద్ద‌లు కూడా జోక్యం చేసుకుని ప‌రిస్థితుల‌ను స‌ర్దుబాటు చేసుకున్నాయి. అదేస‌మ‌యంలో త‌మిళ‌నాడు రెండు ప్రాంతీయ పార్టీలు.. అన్నాడీఎంకే, డీఎంకేల మ‌ధ్య వివాదం రేగిన‌ప్పుడు కూడా జాతీయ పార్టీలు (ఆయా పార్టీలు మ‌ద్ద‌తిచ్చిన పార్టీలు) జోక్యం చేసుకుని ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దాయి.

కానీ, ఇప్పుడు ఏపీలో అలాంటి ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఇటు వైసీపీకి, అటు టీడీపీకి కేంద్రంలో మిత్ర పార్టీ క‌నిపించ‌డం లేదు. బీజేపీ ఉన్నా.. అవ‌స‌రం కోసం.. ఎటు మారినా మారే అవ‌కాశం ఉంది. రేపు చంద్ర‌బాబుకు ప్ర‌జ‌ల్లో ఇమేజ్ పెరుగుతుంద‌నితెలిస్తే.. బీజేపీ నేత‌లు అటు తిరుగుతారు. ఇక‌, కాంగ్రెస్ ఈ రెండు పార్టీల‌నూ కూడా దూరం పెట్టింది.

ఏపీలో కాంగ్రెస్ టీడీపీకి దూరంగానే ఉంది. ఈ నేప‌థ్యంలో ఈరెండు పార్టీల‌మధ్య వివాదాన్ని చ‌ల్లార్చే నాయ‌కులు.. పార్టీలు క‌నుచూపు మేర‌లో క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక‌వేళ ఎవ‌రు జోక్యం చేసుకున్నా.. ఈ రెండు పార్టీల మ‌ధ్య సంస్తాగ‌తంగా పెరుగుతున్న దూరాన్ని త‌గ్గిస్తార‌నే ఆశ‌లు కూడా క‌నిపించ‌డం లేద‌ని.. అందుకే అంద‌రూ.. వేచి చూస్తున్నార‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: